Share News

గంజాయి స్మగ్లర్‌ పరారీపై విచారణ

ABN , Publish Date - May 30 , 2026 | 12:54 AM

పోలీసుల అదుపులో ఉన్న ఓ గంజాయి స్మగ్లర్‌ పరారీ కావడంపై ఎస్పీ తుషార్‌ డూడీ విచారణకు ఆదేశించారు. పూర్తి స్థాయిలో విచారించి బాధ్యులైన వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవడానికి చిత్తూరు డీఎస్పీ వెంకట నారాయణను విచారణాధికారిగా నియమించారు.

గంజాయి స్మగ్లర్‌ పరారీపై విచారణ

చిత్తూరు అర్బన్‌, మే 29(ఆంధ్రజ్యోతి): పోలీసుల అదుపులో ఉన్న ఓ గంజాయి స్మగ్లర్‌ పరారీ కావడంపై ఎస్పీ తుషార్‌ డూడీ విచారణకు ఆదేశించారు. పూర్తి స్థాయిలో విచారించి బాధ్యులైన వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవడానికి చిత్తూరు డీఎస్పీ వెంకట నారాయణను విచారణాధికారిగా నియమించారు. కర్ణాటక రాష్ట్రం బద్రావదికి చెందిన జప్రిన్‌ అనే స్నేహితుడిని చిత్తూరు నగరానికి చెందిన ఓ మహిళా స్మగ్లర్‌ గంజాయి కావాలని అడిగింది. వారిద్దరూ బుధవారం గంజాయి శాంపిల్‌ తీసుకుని చిత్తూరులోని ఎంఎ్‌సఆర్‌ సర్కిల్‌కు వచ్చారు. ఈ విషయం పోలీసులకు తెలియడంతో అక్కడకు చేరుకుని వారిద్దరిని పట్టుకునేందుకు ప్రయత్నించారు. పోలీసులను చూసిన వెంటనే ఒకరు పారిపోగా... జప్రిన్‌ ను పోలీసులు పట్టుకున్నారు. అతడిని ఒకటో పట్టణ పోలీసు స్టేషన్‌కు తీసుకొచ్చి బేడీలు వేసి ఉంచారు. గురువారం వేకువ జామున జప్రిన్‌ పోలీసుల కళ్లుగప్పి పరారయ్యాడు. ఈ సంఘటనను ఎస్పీ తుషార్‌ డూడీ సీరియ్‌సగా తీసుకున్నారు. పోలీసుల అదుపులో ఉన్న ఓ స్మగ్లర్‌ ఎలా పరారయ్యాడు. ఆ రోజు స్టేషన్‌లో ఎవరెవరూ ఉన్నారు. సెంట్రీ డ్యూటీలో ఎంత మంది ఉన్నారు తదితర వాటిపై పూర్తి స్థాయిలో విచారణకు డీఎస్పీ వెంకటనారాయణను విచారణాధికారిగా ఎస్పీ నియమించారు.

Updated Date - May 30 , 2026 | 12:54 AM