Share News

ఏటీఎం చోరీ కేసు దర్యాప్తు వేగవంతం

ABN , Publish Date - Jul 27 , 2026 | 02:14 AM

మదనపల్లె ఎస్టేట్‌లోని ఎస్బీఐ ఏటీఎం యంత్రాన్ని శుక్రవారం అర్ధరాత్రి గుర్తుతెలియని దుండగులు చోరీ చేసి, అందులో ఉన్న రూ.13.5లక్షల నగదు అపహరించిన కేసు దర్యాప్తును టూటౌన్‌ పోలీసులు వేగవంతం చేశారు. ఇప్పటికే ఎనిమిది ప్రత్యేక బృందాలు గాలింపులో ఉన్నాయి. సీసీ ఫుటేజీల ఆధారంగా ఆయా ప్రాంతాల్లో ముమ్మరంగా గాలిస్తున్నారు.

ఏటీఎం చోరీ కేసు దర్యాప్తు వేగవంతం
టూటౌన్‌ పోలీ్‌సస్టేషన్‌ వద్ద ఉన్న సీఎంఎస్‌ సిబ్బంది

సీఎంఎ్‌సలను విచారిస్తున్న పోలీసులు

నిందితుల కోసం కర్ణాటకలో గాలింపు

మదనపల్లె క్రైం, జూలై 26(ఆంధ్రజ్యోతి): మదనపల్లె ఎస్టేట్‌లోని ఎస్బీఐ ఏటీఎం యంత్రాన్ని శుక్రవారం అర్ధరాత్రి గుర్తుతెలియని దుండగులు చోరీ చేసి, అందులో ఉన్న రూ.13.5లక్షల నగదు అపహరించిన కేసు దర్యాప్తును టూటౌన్‌ పోలీసులు వేగవంతం చేశారు. ఇప్పటికే ఎనిమిది ప్రత్యేక బృందాలు గాలింపులో ఉన్నాయి. సీసీ ఫుటేజీల ఆధారంగా ఆయా ప్రాంతాల్లో ముమ్మరంగా గాలిస్తున్నారు. ఆదివారం క్యాష్‌ మేనేజ్‌మెంట్‌ సర్వీ్‌స(సీఎంఎ్‌స)సిబ్బందిని స్టేషన్‌కు పిలిపించి విచారిస్తున్నారు. ముఖ్యంగా ముగ్గురు డ్రైవర్లు, గన్‌మెన్లు, ఎనిమిది మంది లోడింగ్‌ సిబ్బందిని విచారించి, ఆధారాలు సేకరిస్తున్నారు. ఒక్కొక్కరిని విడిగా విచారిస్తూ వారి నుంచి స్టేట్‌మెంట్‌ రికార్డు చేశారు. వారితో పాటు సీటీఎం రోడ్డులోని ఎస్బీఐ మెయిన్‌ బ్రాంచ్‌ సిబ్బందిని సైతం విచారించారు. ఈ నేపథ్యంలో బృందాలు కర్ణాటలో గాలిస్తున్నాయి. గతంలో అనంతపురం, కదిరి, మదనపల్లె నక్కలదిన్నె ప్రాంతాల్లో జరిగిన ఏటీఎం చోరీ కేసుల్లోని నిందితుల ఫొటోలు, వేలిముద్రలు సేకరించి కర్ణాటకలోని ఆయా పోలీ్‌సస్టేషన్లలో విచారిస్తున్నారు. శనివారం క్లూస్‌ టీం సిబ్బంది సేకరించి ఇచ్చిన నిందితుల వేలిముద్రల ఆధారంగా దర్యాప్తు ముమ్మరం చేశారు. పాతనేరస్థుల ఆచూకీ, వివరాలు సేకరించే పనిలో ఉన్నారు. మదనపల్లె వన్‌టౌన్‌, టూటౌన్‌, తాలూకా, క్రైం పోలీ్‌సస్టేషన్లతో పాటు జిల్లాలో ఆయా స్టేషన్లలో పనిచేస్తూ నేరపరిశోధనలో అనుభవం ఉన్న సిబ్బందిని బృందాల్లో చేర్చుకుని నిందితుల కోసం గాలిస్తున్నారు. వారి సూచనలు, సలహాలతో పాటు టెక్నికల్‌ సిబ్బంది సాయం తీసుకుంటున్నారు. త్వరలోనే కేసు కొలిక్కి వచ్చే అవకాశం ఉందని, నేరస్థుల కదలికలపై పూర్తి సమాచారం ఉందని పోలీసులు చెబుతున్నారు. కాగా యంత్రం శకలాలను స్వాధీనం చేసుకుని స్టేషన్‌ ఆవరణలో ఉంచారు.

Updated Date - Jul 27 , 2026 | 02:14 AM