Share News

ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభం

ABN , Publish Date - May 22 , 2026 | 01:38 AM

ఇంటర్మీడియట్‌ అడ్వాన్స్డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు గురువారం ప్రారంభమయ్యాయి. జిల్లా వ్యాప్తంగా 37 కేంద్రాల్లో ఉదయం, మధ్యాహ్నం పరీక్షలు జరిగాయి.

ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభం
పీసీఆర్‌ జూనియర్‌ కళాశాల పరీక్షా కేంద్రం ఎదుట విద్యార్థులు

తొలిరోజు 228 మంది గైర్హాజరు

చిత్తూరు సెంట్రల్‌, మే 21 (ఆంధ్రజ్యోతి): ఇంటర్మీడియట్‌ అడ్వాన్స్డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు గురువారం ప్రారంభమయ్యాయి. జిల్లా వ్యాప్తంగా 37 కేంద్రాల్లో ఉదయం, మధ్యాహ్నం పరీక్షలు జరిగాయి. 3704 మందికి గాను 3476 మంది హాజరు కాగా, 228 మంది గైర్హాజరైనట్లు డీఐఈవో రఘుపతి తెలిపారు. ఫస్టియర్‌లో 2345 మందికి గాను 2196 మంది హాజరు కాగా.. సెకండియర్‌లో 1359 మందికి గాను 1280 మంది హాజరైనట్లు తెలిపారు.

Updated Date - May 22 , 2026 | 01:38 AM