Share News

ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభం

ABN , Publish Date - May 22 , 2026 | 01:45 AM

ఇంటర్మీడియట్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు గురువారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. జిల్లాలో 52 పరీక్షా కేంద్రాల్లో ఉదయం ప్రథమ సంవత్సరం, మధ్యాహ్నం ద్వితీయ సంవత్సర విద్యార్థులకు రెండు సెషన్లలో లాంగ్వేజ్‌ పరీక్షలు(తెలుగు/హిందీ/సంస్కృత) నిర్వహించారు.

ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభం

తొలిరోజు ప్రథమలో 5140మంది, ద్వితీయలో 2369మంది హాజరు

తిరుపతి రూరల్‌, మే 21(ఆంధ్రజ్యోతి): ఇంటర్మీడియట్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు గురువారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. జిల్లాలో 52 పరీక్షా కేంద్రాల్లో ఉదయం ప్రథమ సంవత్సరం, మధ్యాహ్నం ద్వితీయ సంవత్సర విద్యార్థులకు రెండు సెషన్లలో లాంగ్వేజ్‌ పరీక్షలు(తెలుగు/హిందీ/సంస్కృత) నిర్వహించారు. ప్రథమ సంవత్సర జనరల్‌ కోర్సులో 5324మంది విద్యార్థులకుగాను 5005మంది హాజరవగా 319మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. ఒకేషనల్‌ విభాగంలో 145మంది విద్యార్థులకుగాను 135మంది హాజరయ్యారు. ప్రథమ ఇంటర్‌లో మొత్తంగా 5469మందికిగాను 5140మంది విద్యార్థులు హాజరై పరీక్ష రాయగా 329మంది గైర్హాజరైనట్లు ఆర్‌ఐవో రాజశేఖర్‌ రెడ్డి తెలిపారు. మధ్యాహ్నం జరిగిన ద్వితీయ జనరల్‌ విభాగంలో 2547మంది విద్యార్థులకుగాను 2280మంది హాజరయ్యారు. 267మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. ఒకేషనల్‌ విభాగంలో 96మంది విద్యార్థులకుగాను 89మంది హాజరవగా..7మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. ద్వితీయ ఇంటర్‌లో మొత్తంగా 2643మంది విద్యార్థులకుగాను 2369మంది విద్యార్థులు హాజరై పరీక్ష రాయగా 274మంది హాజరుకాలేదన్నారు. జిల్లాలో ఎక్కడా మాల్‌ ప్రాక్టీస్‌ కేసులు నమోదు కాలేదు.

Updated Date - May 22 , 2026 | 01:45 AM