Share News

బిసానత్తంలో గోల్డ్‌ మైన్స్‌ భూముల పరిశీలన

ABN , Publish Date - Jun 21 , 2026 | 01:36 AM

గుడుపల్లె మండలం దాసుమానుపల్లె పంచాయతీ బిసానత్తంలో గోల్డ్‌ మైన్స్‌ భూములను జేసీ అదర్శ రాజేంద్రన్‌ శనివారం పరిశీలించారు.

బిసానత్తంలో గోల్డ్‌ మైన్స్‌ భూముల పరిశీలన

గుడుపల్లె, జూన్‌ 20 (ఆంధ్రజ్యోతి): గుడుపల్లె మండలం దాసుమానుపల్లె పంచాయతీ బిసానత్తంలో గోల్డ్‌ మైన్స్‌ భూములను జేసీ అదర్శ రాజేంద్రన్‌ శనివారం పరిశీలించారు. అత్తినత్తం సర్వే నెం.1లో గోల్డ్‌మైన్‌ సంబంధించిన సుమారు 800 ఎకరాలున్నాయి. 2002లో గోల్డ్‌ మైన్స్‌ మూతపడగా.. దీనికి కేటాయించిన భూములను కొందరు రైతులు ఆక్రమించుకొని సాగు చేసుకొంటున్నారు. ఈ భూములకు పట్టాలు ఇవ్వాలని పలువురు రైతులు వినతులు సమర్పించారు. ఈ క్రమంలో గోల్డ్‌మైన్స్‌ను, రైతులు సాగుచేస్తున్న భూములను జేసీ పరిశీలించారు. పట్టాల అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని రైతుకు హామీ ఇచ్చారు. పెద్దపర్తికుంటలో దారి సమస్య పరిష్కారానికి గ్రామస్తులతో చర్చించారు. తహసీల్దారు సీతారాం, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Jun 21 , 2026 | 01:36 AM