భూ కబ్జాలపై విచారణ
ABN , Publish Date - Aug 01 , 2026 | 01:55 AM
వెంకటగిరిలో భూకబ్జాలు, అక్రమ నిర్మాణాలపై జిల్లా అధికార యంత్రాంగం దృష్టి సారించింది. ఇటీవల ఆంధ్రజ్యోతిలో కథనాలు ప్రచురితమైన నేపథ్యంలో కలెక్టర్ వెంకటేశ్వర్ స్పందించి సమగ్ర విచారణకు ఆదేశాలు జారీ చేశారు. శుక్రవారం స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ భరత్ నాయక్ స్థానిక తహసీల్దారు శిరీషతో కలిసి పలు ప్రాంతాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
వెంకటగిరి, జూలై 31(ఆంధ్రజ్యోతి):వెంకటగిరిలో భూకబ్జాలు, అక్రమ నిర్మాణాలపై జిల్లా అధికార యంత్రాంగం దృష్టి సారించింది. ఇటీవల ఆంధ్రజ్యోతిలో కథనాలు ప్రచురితమైన నేపథ్యంలో కలెక్టర్ వెంకటేశ్వర్ స్పందించి సమగ్ర విచారణకు ఆదేశాలు జారీ చేశారు. శుక్రవారం స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ భరత్ నాయక్ స్థానిక తహసీల్దారు శిరీషతో కలిసి పలు ప్రాంతాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ముందుగా పట్టణంలోని జాతీయ రహదారికి ఆనుకొని ఉన్న ఏకలవ్యనగర్ ప్రాంతాన్ని సందర్శించారు. గ్రామకంఠం సర్వే నెంబర్‌లో రిజిస్ట్రేషన్ చేసుకొన్న భూమికి బదులుగా మరో ప్రాంతంలో భవన నిర్మాణం చేపడుతున్నట్లు గుర్తించారు. నిర్మాణానికి సంబంధించిన అనుమతి పత్రాలను అధికారులు పరిశీలించారు. అనంతరం రాపూరు రహదారిలోని కైవల్యానది పరివాహక ప్రాంతానికి వెళ్లి నిబంధనలకు విరుద్దంగా ఏర్పాటు చేసిన లేఅవుట్‌ను పరిశీలించారు. బఫర్ జ్యోన్‌లో ప్రహరీ నిర్మాణం, లేఅవుట్ భూవినియోగం నిబంధనల అమలుపై ఆరా తీశారు. విచారణ నివేదికను కలెక్టర్‌కు సమర్పించనున్నట్లు ఆయన చెప్పారు.