Share News

నేటితో ముగియనున్న మౌలిక వసతుల గణన

ABN , Publish Date - Sep 14 , 2026 | 01:40 AM

జనాభా లెక్కల సేకరణలో భాగంగా జిల్లా సమస్త సమాచారం తెలిసేలా హ్యాండ్‌ బుక్‌ రూపకల్పనకు అధికార యంత్రాంగం సన్నద్ధమవుతోంది. గ్రామాలకు సంబంధించి సమగ్ర వివరాలు ఈ పుస్తకంలో పొందుపరచనున్నారు. గత నెల 17న మొదలైన ఈ ప్రక్రియ సోమవారంతో ముగియనుంది.

  నేటితో ముగియనున్న మౌలిక వసతుల గణన

చిత్తూరు కలెక్టరేట్‌, సెప్టెంబరు 13 (ఆంరఽధజ్యోతి): జనాభా లెక్కల సేకరణలో భాగంగా జిల్లా సమస్త సమాచారం తెలిసేలా హ్యాండ్‌ బుక్‌ రూపకల్పనకు అధికార యంత్రాంగం సన్నద్ధమవుతోంది. గ్రామాలకు సంబంధించి సమగ్ర వివరాలు ఈ పుస్తకంలో పొందుపరచనున్నారు. గత నెల 17న మొదలైన ఈ ప్రక్రియ సోమవారంతో ముగియనుంది. 2011 జనగణన నాటికి గ్రామాల్లో ఉన్న సదుపాయాలు, మౌలిక వసతులు, ప్రస్తుతం వచ్చిన మార్పులు తదితర విషయాలను ఈ గణనలో నమోదు చేశారు. గ్రామాల్లో ఉన్న సదుపాయాలు, వ్యవసాయం, విద్య, వైద్యం, మంచినీరు, రహదారులు, మార్కెటింగ్‌, అందుబాటులో ఉన్న కార్యాలయాలు, మౌలిక వసతులు, రవాణా సౌకర్యం... ఇలా 250కి పైగా అంశాలు సేకరించే సర్వేను ప్రస్తుతం నిర్వహిస్తున్నారు. గ్రామ సమగ్ర వివరాల సేకరణ బాధ్యతలను వీఆర్వో, పంచాయతీ కార్యదర్శికి అప్పగించారు.

Updated Date - Sep 14 , 2026 | 01:40 AM