పరిశ్రమల పునాది మరింత బలోపేతం
ABN , Publish Date - Sep 04 , 2026 | 02:04 AM
జిల్లాలో పారిశ్రామిక అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం మరింత ఊతమిచ్చింది. పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన భూములను ఏపీఐఐసీకి బదలాయించేందుకు గురువారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పూతలపట్టు, గుడుపల్లె, విజయపురం, చిత్తూరు రూరల్ మండలాల్లో కలిని 102.67 ఎకరాల భూమికి సంబంధించిన ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం తెలిపింది.
నాలుగు మండలాల్లో 104.87 ఎకరాల బదలాయింపు
మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు
చిత్తూరు, సెప్టెంబరు 3 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో పారిశ్రామిక అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం మరింత ఊతమిచ్చింది. పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన భూములను ఏపీఐఐసీకి బదలాయించేందుకు గురువారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పూతలపట్టు, గుడుపల్లె, విజయపురం, చిత్తూరు రూరల్ మండలాల్లో కలిని 102.67 ఎకరాల భూమికి సంబంధించిన ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం తెలిపింది.
పూతలపట్టులో 18.20 ఎకరాలు
పూతలపట్టు మండలం వావిల్‌తోట గ్రామంలోని సర్వే నంబరు 824/20లో 18.20 ఎకరాల భూమిని ఏపీఐఐసీకి బదలాయించేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇక్కడ పారిశ్రామిక పార్కును ఏర్పాటు చేయనున్నారు. ఎకరాకు రూ.28.75 లక్షల చొప్పున చెల్లింపు ప్రాతిపదికన, సాధారణ నిబంధనలకు లోబడి భూమిని బదలాయించనున్నారు.
ఫ గుడుపల్లె మండలం పొరుగుపల్లెలోని సర్వే నంబరు 254 తదితరాల్లో ఉన్న 50.56 ఎకరాల్ని ఏపీఐఐసీకు బదలాయించేందుకు క్యాబినెట్ అనుమతిచ్చింది. ఇక్కడ ఎంఎస్‌ఎంఈ పార్కును ఏర్పాటు చేయనున్నారు. ఈ ప్రాంతంలో ఇప్పటికే రూ.9300 కోట్ల పెట్టుబడితో సుమారు 30 భారీ పరిశ్రమలు పురోగతిలో ఉన్నాయి. తాజా నిర్ణయంతో చిన్న మధ్య తరహా పరిశ్రమలకు కూడా అనుకూల పరిస్థితులు ఏర్పడనున్నాయి.
ఫ ఇదే సమావేశంలో గుడుపల్లె మండలం పొరుగుపల్లె గ్రామంలో 8.65 ఎకరాల గ్రేజింగ్ గ్రౌండ్ పోరంబోకు భూమిని పరిశ్రమల ఏర్పాటుకు వినియోగించేందుకు కూడా క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఆ భూమి వర్గీకరణకు గ్రేజింగ్ గ్రౌండ్ పోరంబోకు నుంచి అసెస్డ్ వేస్డ్ డ్రైగా మార్చి ప్రభుత్వ అధీనంలోకి తీసుకునే ప్రతిపాదనకు అనుమతిచ్చింది.
అప్రోచ్ రోడ్డుకు 17.13 ఎకరాలు
విజయపురం మండలం కోసలనగరం గ్రామంలోని సర్వే నెంబరు 266/1బీ తదితరాల్లోని 17.13 ఎకరాల భూమిని ఏపీఐఐసీకు బదలాయిస్తున్నాయి. ఇప్పటికే ఉన్న కోసలనగరం పారిశ్రామిక పార్కుకు అప్రోడ్ రోడ్డును ఏర్పాటు చేయనున్నారు. పార్కుకు రవాణా సౌకర్యాల అభివృద్ధికి అవకాశం ఏర్పడింది. చిత్తూరు రూరల్ మండలం తేనబండ గ్రామంలోని సర్వే నంబరు 290/3బీ/3 తదితరాల్లోని 10.33 ఎకరాల్ని ఏపీఐఐసీకి కేటాయించనున్నారు. నిబంధనల మేరకు ధర చెల్లించాల్సి ఉంటుంది. ఇక్కడ కూడా పారిశ్రామిక పార్కును ఏర్పాటు చేయనున్నారు.