గంట ఆలస్యంగా నడిచిన ఇండిగో విమానాలు
ABN , Publish Date - Jan 05 , 2026 | 01:36 AM
హైదరాబాద్, ముంబై నుంచి రావాల్సిన ఇండిగో విమానాలు గంట ఆలస్యంగా నడిచాయి. ఆదివారం మధ్యాహ్నం హైదరాబాద్ నుంచి 2.40 గంటలకు బయలుదేరి 3.05 గంటలకు తిరుపతి విమానాశ్రయానికి చేరుకోవాల్సిన ఇండిగో విమానం గంట ఆలస్యంగా అంటే 4.25 గంటలకు చేరుకుంది.
రేణిగుంట జనవరి 4 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్, ముంబై నుంచి రావాల్సిన ఇండిగో విమానాలు గంట ఆలస్యంగా నడిచాయి. ఆదివారం మధ్యాహ్నం హైదరాబాద్ నుంచి 2.40 గంటలకు బయలుదేరి 3.05 గంటలకు తిరుపతి విమానాశ్రయానికి చేరుకోవాల్సిన ఇండిగో విమానం గంట ఆలస్యంగా అంటే 4.25 గంటలకు చేరుకుంది. తిరిగి 4.50గంటలకు బయలుదేరింది. అలాగే సాయంత్రం ముంబై నుంచి 5.20 గంటలకు రావాల్సిన ఇండిగో సర్వీసు గంట ఆలస్యంగా 6.25 గంటలకు తిరుపతికి చేరుకుని 6.50 గంటలకు తిరిగి బయలు దేరి వెళ్లింది.