Share News

ఇండిగో విమాన సర్వీసుల కుదింపు

ABN , Publish Date - Jun 28 , 2026 | 01:05 AM

తిరుపతి విమానాశ్రయం నుంచి వివిధ ప్రాంతాలకు నడుస్తున్న ఇండిగో విమాన సర్వీసులను జూలై 1 నుంచి కుదించనున్నారు. రెగ్యులర్‌ సర్వీసుగా ఉన్న ముంబై నుంచి ఉదయం 8.10గంటలకు బయల్దేరి 10గంటలకు తిరుపతి చేరుకునే సర్వీసును సోమ, గురు, శని, ఆదివారాలు నడిచేలా కుదించారు.

ఇండిగో విమాన సర్వీసుల కుదింపు

రేణిగుంట, జూన్‌ 27(ఆంధ్రజ్యోతి): తిరుపతి విమానాశ్రయం నుంచి వివిధ ప్రాంతాలకు నడుస్తున్న ఇండిగో విమాన సర్వీసులను జూలై 1 నుంచి కుదించనున్నారు. రెగ్యులర్‌ సర్వీసుగా ఉన్న ముంబై నుంచి ఉదయం 8.10గంటలకు బయల్దేరి 10గంటలకు తిరుపతి చేరుకునే సర్వీసును సోమ, గురు, శని, ఆదివారాలు నడిచేలా కుదించారు. దాని షెడ్యూల్‌ టైమింగ్‌ను ముంబై నుంచి ఉదయం 10.30కు బయలుదేరి మద్యాహ్నం 12.15కు తిరుపతికి చేరేలా మార్చారు. అలాగే బెంగళూరు-తిరుపతి, విజయవాడ-తిరుపతి సర్వీసులను సోమ, బుధ, శుక్ర, ఆదివారాలకు కుదించారు. ఈ సర్వీసులు బెంగళూరులో ఉదయం11.25 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 12.25కు తిరుపతికి చేరుకుని మధ్యాహ్నం 1.35గంటలకు విజయవాడకు బయల్దేరుతాయి. విజయవాడ నుంచి మధ్యాహ్నం 3.30గంటలకు బయల్దేరి సాయంత్రం 4.35గంటలకు తిరుపతి చేరుకుంటాయి. అక్కడి నుంచి సాయంత్రం 5.25గంటలకు బెంగళూరుకు బయల్దేరుతాయి. ఢిల్లీ నుంచి తిరుపతికి వచ్చే సర్వీసులను కూడా మంగళ, గురు, శనివారాలకు కుదించారు.

Updated Date - Jun 28 , 2026 | 01:05 AM