Share News

ప్రభుత్వ పనితీరుపై ప్రజల్లో పెరిగిన సంతృప్తి

ABN , Publish Date - Mar 12 , 2026 | 02:44 AM

రాష్ట్ర రాజధానిలో సీఎం చంద్రబాబు బుధవారం కలెక్టర్లతో నిర్వహించిన 6వ కాన్ఫరెన్సు సందర్భంగా జిల్లాకు సంబంధించి చాలా సంగతులు వెల్లడయ్యాయి.ప్రభుత్వ పనితీరు పట్ల ప్రజా సంతృప్తుల విషయంలో జిల్లా స్థానం మెరుగుపడింది. గతేడాది డిసెంబరు నాటికి ప్రజల సంతృప్తికి సంబంధించిన స్కోరు 67.2 కాగా ప్రస్తుతం ఆ స్కోరు 69.6కు పెరిగింది. గతంతో పోలిస్తే ప్రజల సంతృప్తి 2.4 పాయింట్లు పెరిగింది.

ప్రభుత్వ పనితీరుపై ప్రజల్లో పెరిగిన సంతృప్తి
కలెక్టర్ల సదస్సులో వెంకటేశ్వర్‌

స్థూల ఉత్పత్తిలో ఒక స్థానం తగ్గినా వ్యవసాయంలో మెరుగుపడింది

సూర్యఘర్‌ అమలులో ప్రథమం

కలెక్టర్ల సదస్సులో వెల్లడైన సంగతులు

తిరుపతి, మార్చి 11 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర రాజధానిలో సీఎం చంద్రబాబు బుధవారం కలెక్టర్లతో నిర్వహించిన 6వ కాన్ఫరెన్సు సందర్భంగా జిల్లాకు సంబంధించి చాలా సంగతులు వెల్లడయ్యాయి.ప్రభుత్వ పనితీరు పట్ల ప్రజా సంతృప్తుల విషయంలో జిల్లా స్థానం మెరుగుపడింది. గతేడాది డిసెంబరు నాటికి ప్రజల సంతృప్తికి సంబంధించిన స్కోరు 67.2 కాగా ప్రస్తుతం ఆ స్కోరు 69.6కు పెరిగింది. గతంతో పోలిస్తే ప్రజల సంతృప్తి 2.4 పాయింట్లు పెరిగింది. ఈ విషయంలో జిల్లా 16వ స్థానంలో వుంది.ఫజీడీడీపీగా పిలిచే జిల్లా స్థూల వార్షిక ఉత్పత్తిలో ఇదివరకూ రాష్ట్రంలో మూడో స్థానంలో వుండగా ఈ ఏడాది నాలుగో స్థానానికి దిగజారింది. రాయలసీమలో మాత్రం మొదటి స్థానంలోనే కొనసాగుతోంది.ఫ వ్యవసాయ రంగ వార్షిక ఉత్పత్తి విలువ పరంగా జిల్లా మునుపటి కంటే ఈ ఏడాది స్థానాన్ని మెరుగుపరుచుకుంది. 2024-25లో రూ.17.178 కోట్లతో 23 శాతం వృద్ధి రేటు అందుకుని 13వ ర్యాంకు సాధించింది. 2025-26లో రూ. 18,566 కోట్లతో 8.08 శాతం వృద్ధి రేటు సాధించి 12వ స్థానాన్ని దక్కించుకుంది. రాయలసీమలో అనంత, సత్యసాయి, కడప తర్వాత నాలుగో స్థానంలో నిలిచింది.ఫపారిశ్రామిక, సేవా రంగాల్లో జిల్లా స్థానం పదిలంగానే వుంది. పారిశ్రామిక రంగ జీడీవీఏ పరంగా 2024-25లో రూ. 32,860 కోట్లతో 7.07 శాతం వృద్ధి రేటు సాధించి 2వ ర్యాంకు సాధించింది.2025-26లో రూ. 36,051 కోట్లతో 9.71 శాతం వృద్ధి రేటు సాధించి అదే ర్యాంకును పదిలపరుచుకుంది. అలాగే సేవా రంగ జీడీవీఏ విషయంలో గతేడాది 4వ ర్యాంకులో నిలిచింది. ప్రస్తుత సంవత్సరంలోనూ ఆ ర్యాంకును నిలబెట్టుకుంది.ఫకేంద్ర ప్రభుత్వ పథకమైన సూర్యఘర్‌ అమలులో జిల్లా నంబర్‌ వన్‌గా నిలిచింది.ఫగ్రామీణ ప్రాంతాల్లో స్వచ్చాంధ్ర అమలు పరంగా జిల్లా అట్టడుగు మూడు జిల్లాల్లో ఒకటిగా నిలిచింది. పంచాయతీరాజ్‌ మరియు గ్రామీణాభివృద్ధి, ఆర్‌ డబ్ల్యుఎస్‌, హౌసింగ్‌ తదితర శాఖలు తీసుకోవాల్సిన చర్యల విషయంలో వెనుకబడ్డాయి.ఫ అదే సమయంలో టీటీడీ 28 ప్రాంతాల్లో నిర్వహిస్తున్న ఆలయాలు, మందిరాలు, మండపాల విషయంలో ప్రభుత్వ అభినందనలు అందుకుంది. టాయిలెట్ల నిర్మాణం, తడిచెత్త, పొడిచెత్త కుండీల ఏర్పాటు, తాగునీటి సదుపాయం, ప్లాస్టిక్‌ రహితంగా పర్యావవరణ హితంగా వస్తువుల వినియోగం, స్థానిక సంస్థలకు రెగ్యులర్‌గా చెత్త అప్పగించడం, మురికినీటి కాలువల నిర్మాణం, నిర్వహణ, పరిసరాల్లో పచ్చదనం పెంచడం, అక్కడే కంపోస్టు, బయోగ్యాస్‌ సదుపాయం వంటివి కల్పించడం, రీసైక్లింగ్‌ ఫ్లవర్‌ వేస్ట్‌, పరిశుభ్రత గురించి అవగాహన కల్పించే బోర్డుల ఏర్పాటు వంటి వాటిని నిర్దేశించిన గడువులోనే వంద శాతం పూర్తి చేసింది.

ఒకటి లోగా మూలపల్లి పనులు ప్రారంభం

ఈ ఏడాది జనవరిలో సీఎం చంద్రబాబు తన స్వగ్రామమైన నారావారిపల్లె సమీపంలో శంకుస్థాపన చేసిన మూలపల్లి లిప్ట్‌ ఇరిగేషన్‌ పనులు ఏప్రిల్‌ 1వ తేదీ లోగా ప్రారంభించాలని సీఎం ఆదేశించారు. హంద్రీ-నీవా ప్రాజెక్టు ప్రధాన కాలువలో 400 కిలోమీటర్లకు పైబడిన పనుల్లో భాగంగా నీవా బ్రాంచి కెనాల్‌ నుంచీ లిప్ట్‌ ద్వారా మూలపల్లి చెరువుకు, అక్కడి నుంచీ లిప్ట్‌ ఇరిగేషన్‌ ద్వారా కళ్యాణి డ్యామ్‌కు కృష్ణా జలాలను అందించే పనులను వచ్చే ఏడాది డిసెంబరులోగా పూర్తి చేయాలని ఆదేశించారు.

ఫైళ్ళ క్లియరెన్సులో ఎస్పీ సుబ్బరాయుడు భేష్‌

ఫైళ్ళ క్లియరెన్సు విషయంలో ఎస్పీ ఎల్‌.సుబ్బరాయుడు భేష్‌ అనిపించుకున్నారు. ప్రభుత్వ పరిశీలనా కాలంలో ఎస్పీ 192 ఫైళ్ళు సిద్ధం చేయగా వివిధ వర్గాల నుంచీ ఆయనకు 880 ఫైళ్ళు అందాయి. ఇందులో 1069 ఫైళ్లను ఎస్పీ తన పరిధిలో పరిష్కరించడం, పై స్థాయికి పంపడం వంటి చర్యల ద్వారా అన్నింటినీ డిస్పోజ్‌ చేశారు. ఆయన వద్ద ఒక్క ఫైలు కూడా పెండింగులో లేదు. ఫైళ్ళను పరిష్కరించడానికి ఆయన సగటున 15 గంటల 6 నిమిషాల సమయం తీసుకున్నారు. ఈ విషయంలో ఎస్పీ రాష్ట్రంలో ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాల తర్వాత మూడవ స్థానంలో నిలిచారు.

మహిళా పోలీసులను ఏదో ఒక శాఖకు అప్పగించండి

ఫ సీఎం దృష్టికి తీసుకెళ్లిన కలెక్టర్‌ వెంకటేశ్వర్‌

తిరుపతి(కలెక్టరేట్‌), మార్చి 11(ఆంధ్రజ్యోతి): కలెక్టర్ల సదస్సులో కలెక్టర్‌ వెంకటేశ్వర్‌ మూడు సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లారు.జిల్లాలోని సచివాలయాల్లో పని చేస్తున్న 600మందికి పైగా మహిళా పోలీసులను ఏదైనా ఒకే శాఖ కిందకు తీసుకొచ్చి విధివిధానాలను రూపొందించాలన్నారు.తిరుపతి జిల్లా ఏర్పడి మూడేళ్లు గడిచిపోయినా ముఖ్యమైన శాఖలు చిత్తూరులోనే నడుస్తుండడంతో సంక్షేమ పథకాలు అమలు, పౌరసేవలకు ఇబ్బందులు తలెత్తుతున్నాయని చెప్పారు. పాత జిల్లా కేంద్రంగా ఉన్న గనులు, భూగర్భశాఖ, సంక్షేమశాఖ కార్యాలయాలను తిరుపతికి తరలించాలని అభ్యర్థించారు. తిరుపతి జిల్లాలో నెల్లూరు జిల్లా నుంచి కలిసిన ఉద్యోగుల బదిలీలు, పదోన్నతులను కూడా ఒకే జిల్లా పరిధిలోకి తీసుకువస్తే బాగుంటుందని కలెక్టర్‌ వెంకటేశ్వర్‌ చెప్పగా సీఎం సానుకూలంగా స్పందించారు.

Updated Date - Mar 12 , 2026 | 02:44 AM