Share News

పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు ఖండిస్తూ జనసేన నిరసన

ABN , Publish Date - Jul 06 , 2026 | 12:07 AM

డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌పై జడ శ్రావణ్‌, ప్రశ్న రావణ్‌, నటుడు ప్రకా్‌షరాజ్‌ చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ జనసేన వినూత్న రీతిలో నిరసన తెలిపింది

 పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు  ఖండిస్తూ జనసేన నిరసన
జడ శ్రావణ్‌, ప్రశ్న రావణ్‌, నటుడు ప్రకా్‌షరాజ్‌ చిత్రపటాల పాడె మోస్తున్న జనసైనికులు

రైల్వేకోడూరు, జూలై 5 (ఆంధ్రజ్యోతి): డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌పై జడ శ్రావణ్‌, ప్రశ్న రావణ్‌, నటుడు ప్రకా్‌షరాజ్‌ చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ ఆదివారం రైల్వేకోడూరులో జనసేన వినూత్న రీతిలో నిరసన తెలిపింది. జనసేన కార్యాలయం ఎదుట ముగ్గురి చిత్రపటాలకు పాడె కట్టి, అంత్యక్రియలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌ మాట్లాడుతూ, పవన్‌ కల్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. జనసేన రాష్ట్ర కార్యదర్శి తాతంశెట్టి నాగేంద్ర, నాయకులు పగడాల మణిప్రసాద్‌, ఏనుగుల జగన్‌హ్మోహన్‌, పగడగాల చంద్రశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 06 , 2026 | 12:07 AM