Share News

తిరుపతిలో టీడీపీకి 39, జనసేనకు 22, బీజేపీకి 5 డివిజన్లు

ABN , Publish Date - Oct 20 , 2026 | 01:52 AM

తిరుపతి మున్సిపల్‌ ఎన్నికలకు సంబంధించి కూటమి పార్టీల మధ్య సీట్ల సర్దుబాటుపై స్పష్టత వచ్చింది. సోమవారం ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, టీడీపీ ఎన్నికల పరిశీలకుడు నూకసాని బాలాజి, శాప్‌ ఛైర్మన్‌ రవినాయుడు, టీడీపీ ఇన్‌చార్జి జేబీ శ్రీనివా్‌స,రాష్ట్ర ఉపాధ్యక్షుడు నరసింహ యాదవ్‌, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు పనబాక లక్ష్మి, దివాకర రెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు సామంచి శ్రీనివాస్‌, నేతలు కోలా ఆనంద్‌, బాను ప్రకాష్‌ రెడ్డి, జనసేన జిల్లా అధ్యక్షుడు పసుపులేటి హరిప్రసాద్‌, ఎన్వీ ప్రసాద్‌, మహేష్‌ యాదవ్‌ ఇతర నేతలు సుదీర్ఘంగా చర్చించారు.

తిరుపతిలో టీడీపీకి 39, జనసేనకు 22, బీజేపీకి 5 డివిజన్లు

తిరుపతి సిటీ, అక్టోబరు 19(ఆంధ్రజ్యోతి): తిరుపతి మున్సిపల్‌ ఎన్నికలకు సంబంధించి కూటమి పార్టీల మధ్య సీట్ల సర్దుబాటుపై స్పష్టత వచ్చింది. సోమవారం ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, టీడీపీ ఎన్నికల పరిశీలకుడు నూకసాని బాలాజి, శాప్‌ ఛైర్మన్‌ రవినాయుడు, టీడీపీ ఇన్‌చార్జి జేబీ శ్రీనివా్‌స,రాష్ట్ర ఉపాధ్యక్షుడు నరసింహ యాదవ్‌, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు పనబాక లక్ష్మి, దివాకర రెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు సామంచి శ్రీనివాస్‌, నేతలు కోలా ఆనంద్‌, బాను ప్రకాష్‌ రెడ్డి, జనసేన జిల్లా అధ్యక్షుడు పసుపులేటి హరిప్రసాద్‌, ఎన్వీ ప్రసాద్‌, మహేష్‌ యాదవ్‌ ఇతర నేతలు సుదీర్ఘంగా చర్చించారు. నగరంలోని 66 డివిజన్లలో గతంలో టీడీపీ 38, జనసేన 22, బీజేపీ 6 డివిజన్లలో పోటీ చేసేలా నిర్ణయం తీసుకున్నారు. అయితే తాజా చర్చల్లో బీజేపీ ఒక స్థానం వదులుకుంది. దీంతో టీడీపీ ఖాతాలో 39 చేరాయి. నామినేషన్ల స్ర్కూట్నీ పూర్తయిన నేపథ్యంలో ఆయా పార్టీలు ఏ డివిజన్‌లో ఎవరు పోటీచేస్తారన్న స్పష్టత వచ్చింది. అయితే అధికారికంగా ఇంకా పేర్లు ప్రకటించలేదు.

టీడీపీ పోటీ చేయనున్న డివిజన్లు- 1, 2, 3, 4, 5, 7, 8, 9, 11, 12, 13, 14, 16, 17, 19, 22, 23, 25, 28, 29, 32, 33, 38, 41, 42, 43, 45, 46, 47, 48, 49, 50, 51, 53, 55, 56, 57, 59, 66,

జనసేన - 6, 10, 15, 18, 20, 24, 27, 30, 31, 34, 35, 36, 37, 39, 40, 51, 54, 58, 60, 61, 63, 65

బీజేపీ - 21, 26,44, 52, 62,

Updated Date - Oct 20 , 2026 | 01:52 AM