ముత్యాల పందిరిలో బాలకృష్ణుడి మురిపెం
ABN , Publish Date - Sep 18 , 2026 | 04:00 AM
శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో మూడోరోజైన గురువారం రాత్రి మలయప్పస్వామి ముత్యపు పందిరి వాహనంపై ఏణి కన్నన్ అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. నిచ్చెన ఎక్కి వెన్న దొంగిలించే బాలకృష్ణుడి లీలను తలపించే ఈ అలంకారం భక్తులను ఎంతగానే ఆకర్షించింది.మాడవీధుల్లో ముత్యాల పందిరి కింద కొలువైన శ్రీవారిని దర్శించుకోవడం ద్వారా తాపత్రయాలు తొలగి, భక్తుల జీవితాల్లో సుఖశాంతులు, సకల శుభాలు చేకూరుతాయని పురాణ ప్రశస్తి.
తిరుమల, ఆంధ్రజ్యోతి: శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో మూడోరోజైన గురువారం రాత్రి మలయప్పస్వామి ముత్యపు పందిరి వాహనంపై ఏణి కన్నన్ అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. నిచ్చెన ఎక్కి వెన్న దొంగిలించే బాలకృష్ణుడి లీలను తలపించే ఈ అలంకారం భక్తులను ఎంతగానే ఆకర్షించింది.మాడవీధుల్లో ముత్యాల పందిరి కింద కొలువైన శ్రీవారిని దర్శించుకోవడం ద్వారా తాపత్రయాలు తొలగి, భక్తుల జీవితాల్లో సుఖశాంతులు, సకల శుభాలు చేకూరుతాయని పురాణ ప్రశస్తి. ఉదయం సింహవాహన సేవలో ఎండకు భక్తులు కొంత ఇబ్బంది పడినా, రాత్రి చల్లటి వాతావరణంలో ముత్యపు పందిరి వాహనసేవను ఆసక్తిగా తిలకించారు.ఉదయం మలయప్ప స్వామి వజ్రవైఢూర్యాలతో అలంకార శోభితుడై, పట్టుపీతాంబరాలు ధరించి యోగనరసింహుడిగా శక్తికి ప్రతీకైన సింహవాహనంపై మాడవీధుల్లో విహరించి భక్తులను కటాక్షించారు. వాహనం ముందు గజరాజులు నడుస్తుండగా భక్తజన బృందాల భజనలు, కోలాటాలు, జీయ్యంగార్ల ఘోష్టితో స్వామిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ వాహనసేవ కోలాహలంగా జరిగింది.
-