లాహిరి లాహిరి లాహిరిలో..
ABN , Publish Date - Oct 05 , 2026 | 12:51 AM
కాణిపాకంలోని ప్రత్యేక ఉత్సవాల్లో భాగంగా ఆదివారం రాత్రి వరసిద్ధుడు తెప్పపై విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. దీంతో ప్రత్యేక ఉత్సవాలు ముగిశాయి.
తెప్పపై వరసిద్ధుడి విహారం
కాణిపాకంలో ముగిసిన ప్రత్యేక ఉత్సవాలు
ఐరాల(కాణిపాకం), అక్టోబరు 4 (ఆంధ్రజ్యోతి): కాణిపాకంలోని ప్రత్యేక ఉత్సవాల్లో భాగంగా ఆదివారం రాత్రి వరసిద్ధుడు తెప్పపై విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. దీంతో ప్రత్యేక ఉత్సవాలు ముగిశాయి. చివరి రోజు కావడంతో వేలాదిగా భక్తులు తరలి వచ్చారు. ఈ కార్యక్రమానికి పుండరీకనాయుడు జ్ఞాపకార్థం ఆయన కుమారుడు గాలిశేషాచలంనాయుడు.. శేషాద్రినాయుడు జ్ఞాపకార్థం వారి సోదరులు, హనుమంతునాయుడు జ్ఞాపకార్థం వారి కుమారులు, రామకృష్ణారెడ్డి జ్ఞాపకార్థం వారి కుమారుడు ఎం.జగన్నాథరెడ్డి, గురజాలదామోదరనాయుడు జ్ఞాపకార్థం వారి కుమారుడు గురజాలపార్థసాధినాయుడు, చల్లగుండ్ల దామోదరనాయుడు జ్ఞాపకార్థం వారి కుమారులు, గురజాల ఆనందనాయుడు, సోదరులు,లంకిపల్లె మోహన్‌బాబు ఉభయదారులుగా వ్యవహరించారు. ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ మణినాయుడు, ఈవో పెంచలకిషోర్, ఆలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఉభయదారులు, పరిసర గ్రామస్తులు, భక్తుల సహకారంతో బ్రహ్మోత్సవాలు విజయవంతంగా ముగిశాయని చైర్మన్, ఈవో తెలిపారు. కాగా, మొగిలీశ్వరాలయం తరపున ఆలయ చైర్మన్ కమలనాథరెడ్డి, వంశపార్యంపర ధర్మకర్త విజయ్‌కుమార్,బోర్డు సభ్యులు కలసి ఆదివారం వరసిద్ధుడికి పట్టు వస్త్రాలను సమర్పించారు.