Share News

పనితీరు మెరుగుపరుచుకోండి

ABN , Publish Date - Nov 14 , 2026 | 02:11 AM

శ్రీకాళహస్తీశ్వరాలయంలోని వంటశాలలను మెకనైజ్‌డ్‌ విధానంతో ఆధునికీకరించాలని దేవదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆదేశించారు. ఆలయంలోని దక్షిణ గోపురానికి అనుకుని ఉన్న నైవేద్యం పోటులో గురువారం అగ్నిప్రమాదం సంభవించిన నేపథ్యంలో మంత్రి శుక్రవారం పోటును పరిశీలించి ప్రమాదంపై సిబ్బందిని ఆరా తీశారు.

 పనితీరు మెరుగుపరుచుకోండి
పోటులో పరిస్థితిని పరిశీలిస్తున్న మంత్రి

వంటశాలల విస్తరణకు ఆదేశాలు

శ్రీకాళహస్తి, నవంబరు 13(ఆంద్రజ్యోతి): శ్రీకాళహస్తీశ్వరాలయంలోని వంటశాలలను మెకనైజ్‌డ్‌ విధానంతో ఆధునికీకరించాలని దేవదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆదేశించారు. ఆలయంలోని దక్షిణ గోపురానికి అనుకుని ఉన్న నైవేద్యం పోటులో గురువారం అగ్నిప్రమాదం సంభవించిన నేపథ్యంలో మంత్రి శుక్రవారం పోటును పరిశీలించి ప్రమాదంపై సిబ్బందిని ఆరా తీశారు. నెయ్యి, నూనెను నిర్దిష్టమైన ఉష్ణోగ్రతతోనే వేడి చేయాలని సూచించారు. ప్రసాదాలను భక్తుల రద్దీకి అనుగుణంగా ఒకట్రెండు రోజుల ముందుగా మాత్రమే సిద్ధం చేసుకోవాలన్నారు.పోటులో చుట్టూ నూనె, నెయ్యి నుంచి వచ్చే జిడ్డు వ్యర్థాలను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలన్నారు. ఇంత పెద్ద ఆలయంలో ఇప్పటివరకు మెకనైజ్‌డ్‌ వంటశాలలు ఎందుకు ఏర్పాటు చేయలేదని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ఆలయంలోని వంటశాలలను పెరిగిన భక్తుల రద్దీకి అనుగుణంగా విస్తరించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. ఇందుకు అవసరమైన ఆగమ సలహాలను అందించేందుకు స్తపతులను, ఇంజనీర్లను పంపుతామని తెలిపారు. ఇక ప్రమాదం సంభవించిన సమయంలో ఫైర్‌ ఎస్టింగిషర్‌ ఎందుకు ఆన్‌ కాలేదని నిలదీశారు.ఇంత పెద్ద ఆలయంలో ఫైర్‌ సేఫ్టీ వ్యవస్థను ఎందుకు ఏర్పాటు చేయలేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఇకనైనా అధికార యంత్రాంగం పనితీరును మెరుగుపరచుకోవాలన్నారు.కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండున్నర సంవత్సరాలైనప్పటికీ ముక్కంటి ఆలయ నిర్వహణపై భక్తుల నుంచి 72శాతం మించి సంతృప్తి వ్యక్తం కాకపోవడం బాధాకరమన్నారు. అంతకు ముందు మంత్రి స్వామిఅమ్మవార్లను దర్శించుకున్నారు.ఆలయ చైర్మన్‌ కొట్టే సాయి, ఈవో బీకే వెంకటేశులు, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కోలా ఆనంద్‌ తదితరులు ఆయన వెంట వున్నారు.

Updated Date - Nov 14 , 2026 | 02:11 AM