రాయచోటిలో నేడు ఇఫ్తార్ విందు
ABN , Publish Date - Mar 15 , 2026 | 02:21 AM
రంజాన్ సందర్భంగా రాష్ట్ర రవాణా, యువజన, క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం ఇఫ్తార్ విందు ఇవ్వనున్నారు.
ఏర్పాట్లు పరిశీలించిన మంత్రి రాంప్రసాద్‌రెడ్డి
రాయచోటి, మార్చి14(ఆంధ్రజ్యోతి): రంజాన్ సందర్భంగా రాష్ట్ర రవాణా, యువజన, క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం ఇఫ్తార్ విందు ఇవ్వనున్నారు. పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో జరగనున్న ఈ కార్యక్రమానికి సంబంధించి శనివారం మంత్రి ఏర్పాట్లను పరిశీలించారు. ఏపీ మైనార్టీ న్యాయశాఖ మంత్రి ఎస్.ఎం.డి.ఫరూక్ హాజరవుతున్నట్లు మంత్రి తెలిపారు. టీడీపీ నేత మండిపల్లి లక్ష్మీప్రసాద్‌రెడ్డి, యువనేత మౌర్యారెడ్డి, మున్సిపల్, పోలీసులు, ఇతర అధికారులు, ముస్లిం మైనార్టీ నేతలు ఆయన వెంట ఉన్నారు.