అలా తలెత్తి చూస్తే.. సీఎం
ABN , Publish Date - May 21 , 2026 | 02:18 AM
బుధవారం మధ్యాహ్నం. ఎండ తీక్షణంగా ఉంది. కుప్పం- కడపల్లె దారిలో తంజమ్మ కొట్టాలు వద్ద జాతీయ రహదారి పక్కన గుట్టలుగా తాటికాయలు. ఆ రహదారిన వెళుతూ.. వీరివద్దకు వచ్చే వారికి తాటికాయలు కొట్టి ముంజలు ఇస్తూ వ్యాపారం చేసుకుంటున్నారు. ఆ సమయంలో రివ్వున దూసుకొచ్చిన కాన్వాయ్ అక్కడ ఆగింది. తాటికాయలు కొట్టేవారు ఒకసారి తల పైకెత్తి చూడగా.. ఎదురుగా సీఎం చంద్రబాబు, భువనేశ్వరి దంపతులు వస్తూ కనిపించారు.
బుధవారం మధ్యాహ్నం. ఎండ తీక్షణంగా ఉంది. కుప్పం- కడపల్లె దారిలో తంజమ్మ కొట్టాలు వద్ద జాతీయ రహదారి పక్కన గుట్టలుగా తాటికాయలు. ఆ రహదారిన వెళుతూ.. వీరివద్దకు వచ్చే వారికి తాటికాయలు కొట్టి ముంజలు ఇస్తూ వ్యాపారం చేసుకుంటున్నారు. ఆ సమయంలో రివ్వున దూసుకొచ్చిన కాన్వాయ్ అక్కడ ఆగింది. తాటికాయలు కొట్టేవారు ఒకసారి తల పైకెత్తి చూడగా.. ఎదురుగా సీఎం చంద్రబాబు, భువనేశ్వరి దంపతులు వస్తూ కనిపించారు. ఒక్కసారిగా షాక్.. భావోద్వేగానికి గురయ్యారు. వీరి సమీపానికి వచ్చిన సీఎం చంద్రబాబు.. ‘బాగున్నారా.. మాకూ తాటిముంజలు ఇవ్వండి. రుచి చూస్తాం’ అని అడగ్గానే మురిసిపోయారా కష్టజీవులు. గబగబా అయిదారులు తాటికాయలు వొలిచి చేతికిచ్చారు. ‘అద్భుతంగా ఉన్నాయి.’ అన్న సీఎం ప్రశంసలకు వారు పొంగిపోయారు. ఇలా బుధవారం మధ్యాహ్నం కుప్పం గంగమ్మను దర్శించుకుని శాంతిపురం మండలం కడపల్లె పంచాయతీలోని స్వగృహానికి వెళుతూ సీఎం చంద్రబాబు.. రోడ్డు పక్కన తాటికాయలు చూసి ఆగి ముంజలు తిన్నారు. చల్లగా ఉన్నాయంటూ కార్మికులను మెచ్చుకున్నారు. వారి కుటుంబ పరిస్థితుల గురించి అడిగి, గ్రూప్ ఫొటో దిగారు.
- కుప్పం, ఆంధ్రజ్యోతి