తాళి కట్టేవరకు కదలను
ABN , Publish Date - Jul 13 , 2026 | 12:13 AM
ఆరేళ్లుగా ప్రేమించుకున్నాం.. తీరా పెళ్లి చేసుకోమంటే తన తల్లి చనిపోతానని బెదిరిస్తోందని నిరాకరించాడు
డక్కిలి, జూలై 12 (ఆంధ్రజ్యోతి): ఆరేళ్లుగా ప్రేమించుకున్నాం.. తీరా పెళ్లి చేసుకోమంటే తన తల్లి చనిపోతానని బెదిరిస్తోందని నిరాకరించాడు. తాళి కట్టే వరకు కదలనంటూ ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలు బైఠాయించి నిరసన తెలిపింది. ఆమె తెలిపిన వివరాల మేరకు.. డక్కిలి మండలం గొల్లపల్లికి చెందిన నల్లిపాక వంశీ, అదే గ్రామానికి చెందిన కత్తి రేణుక ఆరేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఉద్యోగంలో స్థిరపడ్డాక పెళ్లి చేసుకుందామని తొలుత ఆమెతో చెప్పాడు. ఇపుడు ఉద్యోగం వచ్చాక పెళ్లికి నిరాకరిస్తున్నాడని రేణుక కన్నీరు పెట్టుకుంది. కాగా, వంశీ తనను పెళ్లి చేసుకోకుండా మోసం చేశాడంటూ శనివారం రాత్రి ఆమె డక్కిలి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆదివారం ఉదయం ప్రియుడి ఇంటి ముందు బైఠాయించింది. వంశీతో తన పెళ్లి జరిగే వరకు కదలనంటూ భీష్మించుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులొచ్చి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. వంశీ ఇంట్లో లేడని.. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడని పోలీసులు తెలిపారు. యువతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని వంశీని ఇంటికి రప్పించే ప్రయత్నం చేస్తున్నామన్నారు.