పర్యాటకులపై తేనెటీగల దాడి
ABN , Publish Date - Nov 15 , 2026 | 12:54 AM
పర్యాటకులపై తేనెటీగలు దాడి చేయడంతో ఏడుగురు గాయపడ్డారు. చిత్తూరుకు చెందిన పావని(32) ఆమె కుటుంబీకులు నీరజ్(32), భవతి(14), గురుప్రియ(20), మనోజ్(34), షౌహిత్(18), చరిష్మా(23) శనివారం కారులో బి.కొత్తకోట మండలం హార్సిలీహిల్స్‌కు వెళ్లారు.
- ఏడుగురికి గాయాలు
మదనపల్లె క్రైం, నవంబరు 14(ఆంధ్రజ్యోతి): పర్యాటకులపై తేనెటీగలు దాడి చేయడంతో ఏడుగురు గాయపడ్డారు. చిత్తూరుకు చెందిన పావని(32) ఆమె కుటుంబీకులు నీరజ్(32), భవతి(14), గురుప్రియ(20), మనోజ్(34), షౌహిత్(18), చరిష్మా(23) శనివారం కారులో బి.కొత్తకోట మండలం హార్సిలీహిల్స్‌కు వెళ్లారు. అక్కడ ఘాట్ రోడ్డులో నిలబడి ప్రకృతి అందాలను తిలకిస్తుండగా తేనెటీగల గుంపు దాడి చేశాయి. గాయపడిన బాధితులను స్థానికులు ప్రైవేటు వాహనాల్లో మదనపల్లె జిల్లా ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు పరీక్షించి మెరుగైన వైద్యం అందించారు. ఎవరికీ ప్రాణాపాయం లేదని వైద్యులు చెప్పడంతో స్వగ్రామానికి బయలుదేరి వెళ్లారు.