మున్సిపల్ ఎన్నికల్లో చారిత్రాత్మక విజయం
ABN , Publish Date - Oct 20 , 2026 | 01:46 AM
రాయచోటి మున్సిపాలిటీలో 44 వార్డులు ఏకగ్రీవం కావడం చారిత్రాత్మకమని మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి అన్నారు.
రాయచోటిలో 44 వార్డులు ఏకగ్రీవం
వైసీపీకి తగ్గిన ప్రజాదరణ
మంత్రి రాంప్రసాద్‌రెడ్డి
రాయచోటి, అక్టోబరు 19 (ఆంధ్రజ్యోతి) : రాయచోటి మున్సిపాలిటీలో 44 వార్డులు ఏకగ్రీవం కావడం చారిత్రాత్మకమని మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి అన్నారు. సోమవారం రాయచోటిలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. రాయచోటిలో వైసీపీకి ప్రజాదరణ తగ్గిందనడానికి ఇది నిదర్శనమన్నారు. శ్రీకాంత్‌రెడ్డి అధికారం కోల్పోతానే ప్రజల సమస్యలను పట్టించుకోలేదన్నారు. పార్టీలకతీతంగా ప్రజలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. సంక్షేమ పథకాలు అందేలా చూస్తూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. 15 ఏళ్లుగా చేయలేని అభివృద్ధిని రెండున్నరేళ్లలో చేసి చూపానని, దీనిపై బహిరంగ చర్చకు సిద్ధమని అన్నారు. రాయచోటి పరిసర ప్రాంతాల్లో యువతను మాదకద్రవ్యాల బారినపడేలా చేసినటువంటి వ్యక్తిని వైసీపీ మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా ఎలా ప్రకటిస్తారని విమర్శించారు. హింసకు తావు లేకుండా ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు జరగడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా పనిచేస్తామన్నారు. ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయానికి కృషి చేసిన నాయకులు, కార్యకర్తలకు అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో రాయచోటి అబ్జర్వర్ అనితయాదవ్, టీడీపీ మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి బోనుమల్ల ఖాదర్‌వల్లి పాల్గొన్నారు.