Share News

తండ్రి మరణాన్ని గుండెల్లో దాచుకుని....

ABN , Publish Date - Feb 24 , 2026 | 01:20 AM

తండ్రి చనిపోయిన దుఃఖాన్ని గుండెల్లో దాచుకుని ఓ విద్యార్థిని పరీక్షకు హాజరైంది. సత్యవేడు మండలం పెద్ద ఈటిపాకం గ్రామానికి చెందిన వి.సుబ్రహ్మణ్యం కుమార్తె వి.సంజీత స్థానిక ప్రైవేటు కళాశాలలో ఇంటర్‌ చదువుతోంది.

తండ్రి మరణాన్ని గుండెల్లో దాచుకుని....
పరీక్షకు హాజరైన సంజీత

సత్యవేడు, ఫిబ్రవరి 23(ఆంధ్రజ్యోతి): తండ్రి చనిపోయిన దుఃఖాన్ని గుండెల్లో దాచుకుని ఓ విద్యార్థిని పరీక్షకు హాజరైంది. సత్యవేడు మండలం పెద్ద ఈటిపాకం గ్రామానికి చెందిన వి.సుబ్రహ్మణ్యం కుమార్తె వి.సంజీత స్థానిక ప్రైవేటు కళాశాలలో ఇంటర్‌ చదువుతోంది. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న సుబ్రహ్మణ్యం తిరుపతి రుయాలో చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి మృతి చెందాడు. తండ్రి మరణంతో దుఃఖంలో మునిగిపోయిన సంజీతను బంధువులు ఓదార్చి పరీక్షా కేంద్రానికి తీసుకొచ్చారు.కన్నీళ్ళను దిగమింగుకుని సంజీత పరీక్ష రాయడం చూపరులను కలచివేసింది.

Updated Date - Feb 24 , 2026 | 01:20 AM