Share News

రేపటి సీఎం పర్యటన ఇలా...

ABN , Publish Date - Sep 14 , 2026 | 01:44 AM

ముఖ్యమంత్రి చంద్రబాబు రెండు రోజుల పర్యటన నిమిత్తం మంగళవారం సాయంత్రం తిరుమలకు వస్తున్నారు.శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామివారికి పట్టువస్త్రాలను సమర్పిస్తారు.

   రేపటి సీఎం పర్యటన ఇలా...

తిరుపతి(కలెక్టరేట్‌), సెప్టెంబరు 13(ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి చంద్రబాబు రెండు రోజుల పర్యటన నిమిత్తం మంగళవారం సాయంత్రం తిరుమలకు వస్తున్నారు.శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామివారికి పట్టువస్త్రాలను సమర్పిస్తారు.మంగళవారం సాయంత్రం 4గంటలకు హెలికాప్టర్‌లో ఉండవల్లి నుంచి బయలుదేరి తిరుపతి ఎస్వీ అగ్రికల్చరల్‌ కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌కు 5.30గంటలకు చేరుకుంటారు. అక్కడినుంచి నేరుగా రోడ్డు మార్గాన తిరుమలకు చేరుకుని పద్మావతి అతిధిగృహంలో కొంతసేపు విశ్రాంతి తీసుకుంటారు. 8గంటలకు పట్టువస్త్రాలు సమర్పించి శ్రీవారిని దర్శించుకుంటారు. 8.45గంటలకు ఆలయంలో 2027వ సంవత్సరానికి సంబంఽఽధించి టీటీడీ క్యాలెండర్లు, డైరీలు ఆవిష్కరిస్తారు. 9గంటలకు వాహనమండపం వద్దకు చేరుకుని పెద్దశేషవాహనసేవలో పాల్గొంటారు. అనంతరం పద్మావతి గెస్ట్‌హౌ్‌సకు చేరుకుని బస చేస్తారు.బుధవారం ఉదయం 8.40గంటలకు వైకుంఠం క్యూకాంప్లెక్సు-1లోని 17వ కంపార్టుమెంట్‌లో యాత్రికుల సౌకర్యార్థం ఎక్స్‌పీరియన్స్‌ సెంటర్‌ను ప్రారంభిస్తారు. 9.15గంటలకు అంబానీ కానుకగా అందించిన విద్యుత్‌ బస్సులను జెండా ఊపి ప్రారంభిస్తారు. 9.35గంటలకు మరమ్మతుల అనంతరం సరికొత్తగా రూపుదిద్దుకున్న ఎస్వీ మ్యూజియాన్ని ప్రార ంభిస్తారు. 10.55గంటలకు పద్మావతి అతిథి గృహానికి చేరుకుంటారు. 11.30గంటలకు టీటీడీ అధికారులతో గంటపాటు సమీక్షిస్తారు. మధ్యాహ్నం 12గంటలకు పద్మావతి అతిధిగృహం నుంచి బయలుదేరి ఎస్వీ అగ్రికల్చర్‌ కళాశాలలోని హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. 12.40గంటలకు ఉండవల్లికి తిరుగుపయనం కానున్నారు.

Updated Date - Sep 14 , 2026 | 01:44 AM