Share News

దాతల స్పందనే ఆమెకు ఊపిరి

ABN , Publish Date - Jul 20 , 2026 | 01:41 AM

పేదింటి బిడ్డ. తండ్రి ప్రోత్సాహంతో ఉన్నత చదువు చదివింది. ఇప్పుడు తీవ్రవ్యాధితో పోరాడుతోంది. కరసనపల్లె గ్రామంలోని వెంకటరమణ,లక్ష్మీ దంపతులకు ముగ్గురు కుమార్తెలు. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నా వెంకటరమణ పిల్లలను చదివించాడు. వీరిలో చిన్నమ్మాయి రమ్యశ్రీ బెంగళూరులో చార్టెర్డ్‌ అకౌంటెన్సీ ఉత్తీర్ణురాలైంది. ఆర్థిక పరిస్థితులు చక్కబడుతున్న తరుణంలో ఇటీవల ఆమె అనారోగ్యం పాలైంది. పలు ఆస్పత్రుల్లో వైద్యం చేయించినా వ్యాధి దారికి రాలేదు. వారం రోజుల క్రితం చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చేర్పించారు.

దాతల స్పందనే ఆమెకు ఊపిరి
బాధితురాలికి చెక్కు పంపిణీ చేస్తున్న నాగశంకరరెడ్డి

  • పేద విద్యావంతురాలికి అరుదైన వ్యాధి

  • ఊపిరితిత్తుల మార్పిడీ అవసరమన్న వైద్యులు

  • ఆదుకోవాలని అభ్యర్థిస్తున్న తల్లిదండ్రులు

పెద్దపంజాణి జూలై 19(ఆంధ్రజ్యోతి): పేదింటి బిడ్డ. తండ్రి ప్రోత్సాహంతో ఉన్నత చదువు చదివింది. ఇప్పుడు తీవ్రవ్యాధితో పోరాడుతోంది. కరసనపల్లె గ్రామంలోని వెంకటరమణ,లక్ష్మీ దంపతులకు ముగ్గురు కుమార్తెలు. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నా వెంకటరమణ పిల్లలను చదివించాడు. వీరిలో చిన్నమ్మాయి రమ్యశ్రీ బెంగళూరులో చార్టెర్డ్‌ అకౌంటెన్సీ ఉత్తీర్ణురాలైంది. ఆర్థిక పరిస్థితులు చక్కబడుతున్న తరుణంలో ఇటీవల ఆమె అనారోగ్యం పాలైంది. పలు ఆస్పత్రుల్లో వైద్యం చేయించినా వ్యాధి దారికి రాలేదు. వారం రోజుల క్రితం చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చేర్పించారు. వైద్య పరీక్షలు చేయించారు. రెండు ఊపిరి తిత్తులూ దెబ్బతిన్నట్లు వైద్యులు గుర్తించారు. లింఫాంజియో లియోమైటోసిస్‌ అనే అరుదైన వ్యాధితో బాధపడుతోందని నిర్ధారించారు. అత్యవసరంగా ఊపిరితిత్తుల మార్పిడికి శస్త్రచికిత్స చేయాలన్నారు. ఇందుకోసం రూ.50 లక్షలు ఖర్చు అవుతుందన్నారని బాధితురాలి కుటుంబ సభ్యులు తెలిపారు. అంత పెద్ద మొత్తం సమకూర్చే స్థోమత తమకు లేదని విలపిస్తున్నారు. గ్రామానికి చెందిన లీలావతమ్మ, రామక్రిష్ణారెడిల కుటుంబ సభ్యులు, జయశంకరరెడ్డి, విజయశంకరరెడ్డి, రవిశంకరరెడ్డి, నాబశంకరరెడ్డిలు మానవతాదృక్పథంతో ముందుకువచ్చారు. ఆదివారం వీరు రూ.70 వేల చెక్కును బాధిత కుటుంబానికి అందించారు. శస్త్ర చికిత్స అనంతరం మరింత సాయం అందిస్తామన్నారు. దయార్ద్ర హృదయులు స్పందించి బిడ్డ ప్రాణాలు కాపాడాలని రమ్యశ్రీ కుటుంబీకులు కోరుతున్నారు. శామకూరి రమ్యశ్రీకి చెందిన పెద్దపంజాణి యూనియన్‌ బ్యాంకు ఖాతా నంబరు(230210100110030)కు లేదా 7569298992 నంబరు ద్వారా ఆర్థిక సాయం పంపి ఆదుకోవాలని అభ్యర్థిస్తున్నారు.

Updated Date - Jul 20 , 2026 | 01:41 AM