గరుడ వారధిపై హెల్మెట్ తప్పనిసరి
ABN , Publish Date - Mar 26 , 2026 | 01:59 AM
తిరుపతి నగరంలోని గరుడ వారధిపై ప్రయాణించే వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని కలెక్టర్ వెంకటేశ్వర్ ప్రకటించారు.
తిరుపతి(కలెక్టరేట్), మార్చి 25(ఆంధ్రజ్యోతి): తిరుపతి నగరంలోని గరుడ వారధిపై ప్రయాణించే వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని కలెక్టర్ వెంకటేశ్వర్ ప్రకటించారు. కలెక్టరేట్‌లో జరిగిన రహదారుల భద్రతా కమిటీ సమావేశంలో మాట్లాడుతూ గరుడ వారధిపై భారీ వాహనాలకు అనుమతి లేదన్నారు. గంజాయి, మత్తు పదార్థాల వాడకంతో జరిగే అనర్థాలపై విద్యార్థులకు అవగాహన కల్పించాలని ఆదేశించారు.ఎస్పీ సుబ్బరాయుడు మాట్లాడుతూ జిల్లాలో 83 బ్లాక్‌స్పాట్లు గుర్తించామని... ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలని ఎన్‌హెచ్ అధికారులను ఆదేశించారు. ఏఎస్పీ రవి మనోహరాచారి, ఎన్‌హెచ్‌పీడీలు వెంకటేశ్వర్లు, రవీంద్రరావు, జిల్లా రవాణాశాఖాధికారి మురళీమోహన్, డీఎంహెచ్‌వో బాలకృష్ణనాయక్ తదితరులు పాల్గొన్నారు.