Share News

అటవీ సమీప గ్రామాల్లో భారీవర్షం

ABN , Publish Date - May 25 , 2026 | 12:57 AM

రామకుప్పం మండలంలోని అటవీ సమీప గ్రామాల్లో ఆదివారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. పెద్దూరు, ననియాలతండా, వీర్నమల, పెద్దతండా, గుట్టూరుతండా, చిక్కలపల్లె తండాల్లో ఉరుములు, మెరుపులతో గంటపాటు వాన కురిసింది.

అటవీ సమీప గ్రామాల్లో భారీవర్షం
పెద్దూరులో కాలువలోకి ప్రవహిస్తున్న వర్షపునీరు

పిడుగుపాటుకు కాలిపోయిన కొబ్బరిచెట్టు

రామకుప్పం, మే 24 (ఆంధ్రజ్యోతి): రామకుప్పం మండలంలోని అటవీ సమీప గ్రామాల్లో ఆదివారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. పెద్దూరు, ననియాలతండా, వీర్నమల, పెద్దతండా, గుట్టూరుతండా, చిక్కలపల్లె తండాల్లో ఉరుములు, మెరుపులతో గంటపాటు వాన కురిసింది. పెద్దూరులో వడగండ్ల వర్షం పడింది. గుట్టూరుతండాలో పిడుగుపాటుకు ఓ కొబ్బరిచెట్టు కాలిపోయింది. భారీ శబ్దాలతో ఉరుములు, మెరుపులతో పిడుగు పడటంతో గ్రామస్తులు భయాందోళన చెందారు. పది రోజులుగా మండుటెండలతో ఠారెత్తిన అటవీ ప్రాంత జనానికి ఈ వర్షం ఊరటనిచ్చింది. ఆదివారం ఉదయం భానుడు తన ప్రతాపం చూపడంతో జనం ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరయ్యారు. సాయంత్రం ఆకాశం మేఘావృతమై వాతావరణం చల్లబడింది. కాసేపటికే భారీవర్షం ప్రారంభమైంది. గ్రామాల సమీపంలోని చిన్న చిన్న కుంటలు వర్షపునీటితో నిండాయి. చెరువుల్లోని గుంతలకు కూడా నీరు చేరింది.

Updated Date - May 25 , 2026 | 12:57 AM