Share News

సర్వభూపాలుడిపై సహస్రనామాలవాడు

ABN , Publish Date - Oct 16 , 2026 | 01:47 AM

నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో నాల్గవ రోజైన గురువారం రాత్రి రుక్ష్మిణీ, సత్యభామ సమేత వేణుగోపాలస్వామి అలంకారంలో మలయప్పస్వామి దర్శనమిచ్చారు. రాత్రి 7 నుంచి 9 గంటల వరకు సర్వభూపాల వాహనంపై మాడ వీధుల్లో విహరించి భక్తులను అనుగ్రహించారు.చిరుజల్లులు కురుస్తుండడంతో కొంతసేపు వాహనాన్ని ఘటాటోపం కింద ఊరేగించారు.

సర్వభూపాలుడిపై సహస్రనామాలవాడు

తిరుపతి(టీటీడీ), అక్టోబరు 15 (ఆంధ్రజ్యోతి): నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో నాల్గవ రోజైన గురువారం రాత్రి రుక్ష్మిణీ, సత్యభామ సమేత వేణుగోపాలస్వామి అలంకారంలో మలయప్పస్వామి దర్శనమిచ్చారు. రాత్రి 7 నుంచి 9 గంటల వరకు సర్వభూపాల వాహనంపై మాడ వీధుల్లో విహరించి భక్తులను అనుగ్రహించారు.చిరుజల్లులు కురుస్తుండడంతో కొంతసేపు వాహనాన్ని ఘటాటోపం కింద ఊరేగించారు.తెలంగాణ మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి, ప్రముఖ గాయకులు రమ్య బెహరా ఆమె భర్త అనురాగ్‌ కులకర్ణి వాహనసేవలో పాల్గొని స్వామిని దర్శించుకున్నారు.ఉదయం మలయప్పస్వామి ఉభయదేవేరులతో కలిసి బకాసుర వధ అలంకారంలో కల్పవృక్ష వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు.టీటీడీ జీయర్‌ స్వాములు,ఛైర్మన్‌ బీఆర్‌ నాయుడు, ఈవో రవిచంద్ర, అదనపు ఈవో వెంకయ్యచౌదరి,జేఈవో గోపీనాథ్‌, సీవీఎస్వో మురళీకృష్ణ,కలెక్టర్‌ ఎస్‌.వెంకటేశ్వర్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Oct 16 , 2026 | 01:47 AM