పెళ్లి చేసుకోమంటే.. చంపేశాడు..!
ABN , Publish Date - Jan 09 , 2026 | 01:16 AM
తనను పెళ్లి చేసుకోమన్న యువతిని చంపేశాడు. ఆపై ఏమీ తెలియనట్లు పోలీసులతో కలిసి ఆమె కోసం వెతికాడు. చివరకు యువతి మృతదేహం లభ్యమవడంతో తన బాగోతం ఎక్కడ తెలిసిపోతుందోనని కనిపించకుండా పోయాడని డీఎస్పీ సాయినాథ్ తెలిపారు. వివరాలను గురువారం రెండో పట్టణ పోలీసు స్టేషన్‌లో సీఐ నెట్టికంఠయ్య, ఎస్‌ఐ రమే్‌షబాబుతో కలిసి మీడియాకు తెలిపారు. చిత్తూరు గిరింపేటలోని బాలాజీనగర్‌కు చెందిన చిట్టిబాబు కుమార్తె కవిత(38) దివ్యాంగురాలు. ఈమె కాణిపాకం ఆలయంలో కాంట్రాక్టు పద్ధతిపై కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేస్తున్నారు. గత నెల 31వ తేదీ సాయంత్రం గుడికి వెళ్లి వెస్తానని మూడు చక్రాల వాహనంలో ఇంటి నుంచి బయటికి వచ్చింది. ఆ వాహనాన్ని రాఘవ థియేటర్ సమీపంలో వదిలి ఆటోలో వెళ్లిపోయింది. ఆమె తమ్ముడు కిరణ్ తన అక్క ఇంటికి రాలేదని వికలాంగుల సంఘ నేతలకు చెప్పాడు. వారంతా కలిసి వెతికినా కనిపించకపోవడంతో ఈనెల రెండో తేదీన రెండో పట్టణ పోలీసు స్టేషన్‌లో మిస్సింగ్ కేసు పెట్టాడు. అందులో గణేష్ అనే దివ్యాంగుడిపై అనుమానం వ్యక్తం చేశాడు. ఇతను క్రీడాకోటాలో ఓ బ్యాంకులో అసిస్టెంట్ మేనేజర్‌గా చిత్తూరులోనే పనిచేస్తున్నాడు. పోలీసులను అతడిని విచారించగా ఏమీ తెలియనట్లు కవిత ఆచూకీ కోసం వారితో కలిసి వెతుకులాట ప్రారంభించాడు. మరోవైపు సాంకేతికత ఆధారంగా మృతురాలి ఫోన్ జీడీనెల్లూరు మండలంలో చూపించడంతో పోలీసులు అక్కడికెళ్లి గాలించారు. ఈనెల 7వ తేదీన జీడీ నెల్లూరు మండలం-ఎన్‌ఆర్‌పేట సమీపంలో ఉన్న నీవానది బ్రిడ్జి కింద కవిత మృతదేహం కనిపించింది. అప్పటినుంచి గణేష్ కనిపించకుండా పోయాడు. మరోవైపు లభించిన ఆధారాల ప్రకారం గణే్‌షపై అనుమానం బలపడింది. ఆరా తీయగా, పెళ్లి చేసుకోమని కవిత ఒత్తిడి తేవడంతో ఆమెను గణేష్ చంపేసినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. త్వరలోనే నిందితుడిని పట్టుకుంటామని డీఎస్పీ తెలిపారు.
- నిందితుడిని త్వరలోనే పట్టుకుంటాం: డీఎస్పీ
చిత్తూరు అర్బన్, జనవరి 8 (ఆంధ్రజ్యోతి): తనను పెళ్లి చేసుకోమన్న యువతిని చంపేశాడు. ఆపై ఏమీ తెలియనట్లు పోలీసులతో కలిసి ఆమె కోసం వెతికాడు. చివరకు యువతి మృతదేహం లభ్యమవడంతో తన బాగోతం ఎక్కడ తెలిసిపోతుందోనని కనిపించకుండా పోయాడని డీఎస్పీ సాయినాథ్ తెలిపారు. వివరాలను గురువారం రెండో పట్టణ పోలీసు స్టేషన్‌లో సీఐ నెట్టికంఠయ్య, ఎస్‌ఐ రమే్‌షబాబుతో కలిసి మీడియాకు తెలిపారు. చిత్తూరు గిరింపేటలోని బాలాజీనగర్‌కు చెందిన చిట్టిబాబు కుమార్తె కవిత(38) దివ్యాంగురాలు. ఈమె కాణిపాకం ఆలయంలో కాంట్రాక్టు పద్ధతిపై కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేస్తున్నారు. గత నెల 31వ తేదీ సాయంత్రం గుడికి వెళ్లి వెస్తానని మూడు చక్రాల వాహనంలో ఇంటి నుంచి బయటికి వచ్చింది. ఆ వాహనాన్ని రాఘవ థియేటర్ సమీపంలో వదిలి ఆటోలో వెళ్లిపోయింది. ఆమె తమ్ముడు కిరణ్ తన అక్క ఇంటికి రాలేదని వికలాంగుల సంఘ నేతలకు చెప్పాడు. వారంతా కలిసి వెతికినా కనిపించకపోవడంతో ఈనెల రెండో తేదీన రెండో పట్టణ పోలీసు స్టేషన్‌లో మిస్సింగ్ కేసు పెట్టాడు. అందులో గణేష్ అనే దివ్యాంగుడిపై అనుమానం వ్యక్తం చేశాడు. ఇతను క్రీడాకోటాలో ఓ బ్యాంకులో అసిస్టెంట్ మేనేజర్‌గా చిత్తూరులోనే పనిచేస్తున్నాడు. పోలీసులను అతడిని విచారించగా ఏమీ తెలియనట్లు కవిత ఆచూకీ కోసం వారితో కలిసి వెతుకులాట ప్రారంభించాడు. మరోవైపు సాంకేతికత ఆధారంగా మృతురాలి ఫోన్ జీడీనెల్లూరు మండలంలో చూపించడంతో పోలీసులు అక్కడికెళ్లి గాలించారు. ఈనెల 7వ తేదీన జీడీ నెల్లూరు మండలం-ఎన్‌ఆర్‌పేట సమీపంలో ఉన్న నీవానది బ్రిడ్జి కింద కవిత మృతదేహం కనిపించింది. అప్పటినుంచి గణేష్ కనిపించకుండా పోయాడు. మరోవైపు లభించిన ఆధారాల ప్రకారం గణే్‌షపై అనుమానం బలపడింది. ఆరా తీయగా, పెళ్లి చేసుకోమని కవిత ఒత్తిడి తేవడంతో ఆమెను గణేష్ చంపేసినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. త్వరలోనే నిందితుడిని పట్టుకుంటామని డీఎస్పీ తెలిపారు.