Share News

తిరుమల అవ్వాచారికోనలో దూకేశాడు

ABN , Publish Date - Nov 05 , 2026 | 12:57 AM

తిరుమల నుంచి తిరుపతికి చేరుకునే మొదటిఘాట్‌రోడ్డులోని అవ్వాచారికోనలోకి గుర్తుతెలియని వ్యక్తి దూకాడు. మోకాళ్లమిట్ట సమీపంలో బుధవారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది.

తిరుమల అవ్వాచారికోనలో దూకేశాడు
లోయలోకి దూకిన వ్యక్తి కోసం గాలిస్తున్న టీటీడీ సిబ్బంది

తిరుమల, నవంబరు 4(ఆంధ్రజ్యోతి): తిరుమల నుంచి తిరుపతికి చేరుకునే మొదటిఘాట్‌రోడ్డులోని అవ్వాచారికోనలోకి గుర్తుతెలియని వ్యక్తి దూకాడు. మోకాళ్లమిట్ట సమీపంలో బుధవారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. సాంకేతిక లోపంతో ఘాట్‌రోడ్డులో నిలిచిపోయిన ఓ వాహనాన్ని ఆటోమొబైల్‌ వాహనం తీసుకెళుతున్న క్రమంలో గోడపై నుంచి లోయలోకి దూకుతున్న సుమారు 30 ఏళ్ల వయసున్న వ్యక్తిని సిబ్బంది గుర్తించారు. వెంటనే కేకలు వేస్తూ వాహనాన్ని నిలిపి అక్కడికి చేరుకున్నారు. అప్పటికే లోయలోకి దూకిన వ్యక్తి కనిపించకుండా పోయాడు. అయితే లోయ లోతు తక్కువగానే ఉన్న క్రమంలో ఫారెస్ట్‌, ఫైర్‌, విజిలెన్స్‌ సిబ్బంది కిందికి దిగి ఆ వ్యక్తి కోసం గాలించారు. మధ్యాహ్నం వరకు కన్పించకపోవడంతో దూకిన వ్యక్తి మరో మార్గం నుంచి పైకి వచ్చి ఉంటాడని అధికారులు అంచనా వేస్తున్నారు. పైగా లోయవైపు కాకుండా చిన్నపాటి లోతున్న వైపు దూకిన క్రమంలో తిరిగి పైకి వచ్చేయవచ్చని అధికారులు తెలిపారు.

Updated Date - Nov 05 , 2026 | 12:57 AM