Share News

‘కుప్పం’లో అతడు మిగిలిన చోట్ల ఆమె

ABN , Publish Date - Aug 04 , 2026 | 01:02 AM

జిల్లాలో కుప్పం మినహా మిగిలిన అసెంబ్లీ నియోజక వర్గాల్లో మహిళా ఓటర్లదే ఆధిక్యం. జూలై 31న విడుదలైన ముసాయిదా ఓటర్ల జాబితా ప్రకారం ఈ విషయం స్పష్టమైంది. ‘సర్‌’ సర్వే తర్వాత కుప్పంలో 185 మంది పురుషులు అధికంగా ఉన్నారు.

‘కుప్పం’లో అతడు మిగిలిన చోట్ల ఆమె

ముసాయిదా ఓటర్ల జాబితాలో ఆధిక్యం

జిల్లాలో 16,739 మంది మహిళా ఓటర్లు ఎక్కువ

చిత్తూరు కలెక్టరేట్‌, ఆగస్టు 3 (ఆంధ్రజ్యోతి):

జిల్లాలో కుప్పం మినహా మిగిలిన అసెంబ్లీ నియోజక వర్గాల్లో మహిళా ఓటర్లదే ఆధిక్యం. జూలై 31న విడుదలైన ముసాయిదా ఓటర్ల జాబితా ప్రకారం ఈ విషయం స్పష్టమైంది. ‘సర్‌’ సర్వే తర్వాత కుప్పంలో 185 మంది పురుషులు అధికంగా ఉన్నారు. మిగిలిన ఐదు నియోజకవర్గాలో అతివలే అధికంగా ఉన్నారు. సర్‌కు ముందు.. 2006 జూన్‌ 1న ప్రచురితమైన ఓటరు జాబితాలో జిల్లాకు సంబంధించి పురుషులు 6,58,823, మహిళలు 6,81,236, ఇతరులు 67 మంది కలిపి 13,40,126 మంది ఓటర్లు ఉన్నారు. సర్‌ ప్రక్రియ అనంతరం వివిధ కారణాలతో 1,36,059 మంది ఓటర్ల పేర్లు తొలగించారు. ఆ తర్వాత ప్రకటించిన ముసాయిదా ఓటరు జాబితాలో పురుషులు 5,93,638 (49.28 శాతం), మహిళలు 6,10,377 (50.68 శాతం), ఇతరులు 52 (0.04 శాతం) కలిపి 12,04,067 మంది అర్హులుగా తేలారు. వీరిలో మహిళా ఓటర్లు 16,739 మంది (1.40శాతం) ఎక్కువగా ఉన్నారు. తొలగింపబడిన ఓటర్లలో పురుషులు 65,185, మహిళలు 70,859, ఇతరులు 15 మంది ఉన్నారు.

ఆమె పోయి అతడొచ్చె

ఫ 2026 జూన్‌ 1న విడుదల చేసిన జాబితా ప్రకారం కుప్పం అసెంబ్లీ నియోజకవర్గంలో 1394 మంది మహిళా ఓటర్లు అధికంగా ఉన్నారు. మొత్తం ఓటర్లలో మహిళలు 1,15,927.. పురుషులు 1,14,531 మంది.

ఫ తాజా ముసాయిదా జాబితా ప్రకారం.. కుప్పం ఓటర్లలో 1,03,119 మంది పురుషులు.. 1,02,927 మంది మహిళలు ఉన్నారు. అంటే.. 185 మంది పురుషులు అధికం.

ముసాయిదా ఓటర్ల జాబితా ప్రకారం నియోజకవర్గాలవారీగా వివరాలు

-------------------------------------------------------------------------------------------------

నియోజకవర్గం పురుషులు మహిళలు ఇతరులు మొత్తం

-------------------------------------------------------------------------------------------------

నగరి 88,762 94,047 05 1,82,814

జీడీనెల్లూరు 95,780 96,934 04 1,92,718

చిత్తూరు 85,820 91,256 24 1,77,100

పూతలపట్టు 99,812 1,02,616 06 2,02,434

పలమనేరు 1,20,345 1,22,599 01 2,42,945

కుప్పం 1,03,119 1,02,925 12 2,06,056

----------------------------------------------------------------------------------------------

మొత్తం 5,93,638 6,10,377 52 12,04,067

Updated Date - Aug 04 , 2026 | 01:02 AM