తాను కన్నుమూసి.. ఇద్దరికి చూపునిచ్చి
ABN , Publish Date - Apr 17 , 2026 | 12:31 AM
తాను మరణించినా.. మరో ఇద్దరికి కంటిచూపునిచ్చారామె. రాధమ్మ(55) మరణంతో కుటుంబీకులు విషాదం దిగమింగుకుని.. నేత్రదానానికి అంగీకరించారు.
రాధమ్మ మృతిచెందగా, నేత్రదానం చేసిన కుటుంబ సభ్యులు
యాదమరి, ఏప్రిల్ 16 (ఆంధ్రజ్యోతి): తాను మరణించినా.. మరో ఇద్దరికి కంటిచూపునిచ్చారామె. రాధమ్మ(55) మరణంతో కుటుంబీకులు విషాదం దిగమింగుకుని.. నేత్రదానానికి అంగీకరించారు. యాదమరి మండలం జోడిచింతలకు చెందిన సుబ్బయ్య భార్య రాధమ్మ చిన్న హోటల్ నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నారు. బుధవారం అర్ధరాత్రి నిద్రిస్తున్న సమయంలో ఆమెకు గుండెపోటు వచ్చింది. నిద్రలోనే కన్నుమూశారామె. బతికున్నప్పుడే తన మరణానంతరం నేత్రాలను దానం చేస్తానని ఆమె అంగీకారపత్రం ఇచ్చి ఉన్నారు. విషాదంలో ఉన్నప్పటికీ కుటుంబ సభ్యులు నేత్రదానానికి ముందుకు వచ్చారు. గురువారం ఉదయం కంటి వైద్య నిపుణులు గ్రామానికి చేరుకుని రాధమ్మ భౌతికకాయం నుంచి నేత్రాలను సేకరించి భద్రపరిచారు.