Share News

మద్యం మత్తులో భార్యను కొట్టి చంపేశాడు

ABN , Publish Date - Aug 04 , 2026 | 01:10 AM

భార్యాభర్తల మధ్య ఏర్పడిన కలహం విషాదంగా ముగిసింది. మద్యం మత్తులో భార్యతో గొడవపడిన భర్త దోసెల పెనంతో విచక్షణారహితంగా దాడి చేయడంతో తీవ్రంగా గాయపడిన మహిళ మృతి చెందింది.

మద్యం మత్తులో భార్యను కొట్టి చంపేశాడు
మృతిచెందిన కస్తూరి(ఫైల్‌ఫొటో)

మూడేళ్ల చిన్నారిని అనాథగా మార్చిన కుటుంబ కలహం

తిరుపతి(నేరవిభాగం), ఆగస్టు 3(ఆంఽధ్రజ్యోతి): భార్యాభర్తల మధ్య ఏర్పడిన కలహం విషాదంగా ముగిసింది. మద్యం మత్తులో భార్యతో గొడవపడిన భర్త దోసెల పెనంతో విచక్షణారహితంగా దాడి చేయడంతో తీవ్రంగా గాయపడిన మహిళ మృతి చెందింది. మూడేళ్ల చిన్నారి తల్లిలేని అనాధగా మారింంది. తిరుపతి రూరల్‌ పోలీ్‌సస్టేషన్‌ పరిధిలోని వెంకటపతి నగర్‌లో సోమవారం ఈ ఘటన చోటుచేసుకుంది.సీఐ మద్దయ్యాచారి కథనం ప్రకారం... తిరుపతి శివార్లలోని తాటితోపు సమీపంలో వున్న వెంకటపతి నగర్‌కు చెందిన సురేష్‌ టిప్పర్‌ డైవ్రర్‌గా పనిచేస్తున్నాడు. మద్యానికి బానిసైన సురేష్‌ తరచూ మద్యం సేవించి భార్య కస్తూరి అలియాస్‌ గురవమ్మ (21)తో గొడవపడుతూ వేధించేవాడు. సోమవారం మధ్యాహ్నం కూడా మద్యం తాగివచ్చిన సురేష్‌ భార్యతో గొడవకు దిగాడు. ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఆగ్రహానికి లోనైన సురేష్‌ ఇంట్లో ఉన్న దోసెల పెనాన్ని తీసుకుని కస్తూరి తలపై బలంగా కొట్టాడు. అంతటితో ఊరుకోక చేతులు, కాళ్లతో తంతూ తీవ్రంగా కొట్టాడు. కస్తూరి కేకలు విని అక్కడికి చేరుకున్న చుట్టుపక్కల వాళ్లు కలిసి సురే్‌షను అడ్డుకున్నారు.అక్కడి పరిస్థితులు చూసి చలించి సురే్‌షను చితకబాదారు. అనంతరం పోలీసులకు సమాచారం తెలియజేసి సురే్‌షను అప్పగించారు. తీవ్రంగా గాయపడిన కస్తూరిని తిరుపతి రుయాస్పత్రికి తరలించారు.చికిత్స పొందుతూ ఆమె ఆస్పత్రిలో మృతిచెందింది. ఈ దంపతులకు హర్షిత అనే మూడేళ్ల కుమార్తె ఉంది. నాన్న అమ్మను కొట్టడం చూసి... ఆ తరువాత తల్లికి ఏమైందో తెలియక గుక్కపెట్టి ఏడున్న చిన్నారిని చూసి స్థానికులు చలించిపోయారు.మృతురాలి సోదరుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. సీఐ మద్దయ్య ఆచారి ఆధ్వర్యంలో దర్యాప్తు సాగుతోంది.

Updated Date - Aug 04 , 2026 | 01:10 AM