కష్టపడితేనే ప్రతిఫలం
ABN , Publish Date - Feb 09 , 2026 | 01:39 AM
కష్టపడి పనిచేస్తేనే ప్రతిఫలం దక్కుతుందని బీజేపీ కార్యకర్తల సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ తెలిపారు.
తిరుపతి(నేరవిభాగం), ఫిబ్రవరి 8 (ఆంధ్రజ్యోతి): కష్టపడి పనిచేస్తేనే ప్రతిఫలం దక్కుతుందని బీజేపీ కార్యకర్తల సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ తెలిపారు. జిల్లా అధ్యక్షుడు సామంచి శ్రీనివాస్ పదవి చేపట్టి ఏడాది పూర్తయిన సందర్భంగా తిరుపతి కచ్చపి ఆడిటోరియంలో ఆదివారం జరిగిన కార్యకర్తల సమావేశంలో ఆయన ప్రసంగించారు. తామున్న ప్రాంతంలో పార్టీని బలోపేతం చేయాలనే లక్ష్యంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. దేశాన్ని అస్థిరం చేస్తున్న మావోయిస్టుల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఉందన్నారు. ఇప్పటికే 90 శాతం సాధించినట్టు చెప్పారు. ఈ లక్ష్యం పూర్తయ్యాక మావోయిస్టుల చేతిలో బాధలు అనుభవించిన, ప్రాణాలు పోగొట్టుకున్న వారి కుటుంబాలను సన్మానిస్తామన్నారు. జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి, సామంచి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సన్నారెడ్డి దయాకర్‌రెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షులు కోలా ఆనంద్, అశోక్‌రాజు, ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు సురేష్, మహిళామోర్చా రాష్ట్ర అధ్యక్షులు నిషిధారాజు, శాంతారెడ్డి, జిల్లా మీడియా విభాగం హరి తదితరులు పాల్గొన్నారు. సమావేశానికి ముందు తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ ఆలయం నుంచి కచ్చపి ఆడిటోరియం వరకు పార్టీ శ్రేణులతో కలిసి రాష్ట్ర అధ్యక్షుడు ర్యాలీ నిర్వహించారు.