గుట్కా, కూల్‌లిప్స్ విక్రేత అరెస్ట్
ABN , Publish Date - Jul 13 , 2026 | 12:10 AM
గుట్కా, కూల్‌లిప్స్ విక్రేతను అరెస్ట్ చేసి, రూ.32లక్షల నిషేధిత సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు వన్‌టౌన్ సీఐ రాజారెడ్డి చెప్పారు
మదనపల్లె క్రైం, జూలై 12(ఆంధ్రజ్యోతి): గుట్కా, కూల్‌లిప్స్ విక్రేతను అరెస్ట్ చేసి, రూ.32లక్షల నిషేధిత సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు వన్‌టౌన్ సీఐ రాజారెడ్డి చెప్పారు. ఆదివారం స్థానిక వన్‌టౌన్ పోలీ్‌సస్టేషన్‌లో కేసు వివరాలను మీడియాకు వెల్లడించారు. మదనపల్లెకు చెందిన కాల్వగడ్డ నబీఖాన్ అలియాస్ ఇమ్రాన్(48) స్థానిక అప్పారావుతోటలో ఇమ్రాన్ ట్రేడర్స్ నిర్వహిస్తున్నాడు. కొన్ని రోజులుగా నిషేధిత సామగ్రి విక్రయించడమేగాక దుకాణాలకు సరఫరా చేస్తుండటంతో శనివారం వన్‌టౌన్ పోలీసులు దాడులు నిర్వహించారు. పాన్‌పరాగ్, గుట్కా, కూల్‌లిప్స్, చైనీఖైనీ, బాషా హాన్స్, విమల్, తదితర సామగ్రిని స్వాధీనం చేసుకుని, నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. 26,760ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్, విజయవాడ, కర్నూలు, కర్ణాటక, తదితర ప్రాంతాల నుంచి ఏజెంట్ల ద్వారా కొరియర్స్‌లో ఉత్పత్తులను తెప్పించుకుని మదనపల్లెలో వ్యాపారం సాగిస్తున్నాడు. అతనితో పాటు సరఫరా చేసిన ఏజెంట్లు, దుకాణాల్లో విక్రయాలు సాగిస్తున్న వారిపైనా కేసులు నమోదు చేస్తున్నట్లు సీఐ రాజారెడ్డి చెప్పారు. అలాగే పట్టణంలో దాడులు కొనసాగుతున్నట్లు చెప్పారు. ఇమ్రాన్‌పై బీఎన్‌ఎ్‌స సెక్షన్ల కింద కేసు నమోదు చేసి, రిమాండుకు తరలించి, రూ.32 లక్షల నిషేధిత సామగ్రిని సీజ్ చేసినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఐలు రహీముల్లా, చంద్రశేఖర్ పాల్గొన్నారు.