Share News

కుప్పం ఈ-సైకిల్‌ తెచ్చిన గిన్నిస్‌ రికార్డ్‌

ABN , Publish Date - Sep 19 , 2026 | 01:39 AM

కుప్పం ఈ-సైకిల్‌ రాష్ట్ర ప్రభుత్వానికి, కలెక్టరేట్‌కు గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్‌ సాధించి పెట్టింది. ఈ రికార్డును శుక్రవారం కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌ అందుకున్నారు

కుప్పం ఈ-సైకిల్‌ తెచ్చిన గిన్నిస్‌ రికార్డ్‌
గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్‌ సర్టిఫికెట్‌ అందుకుంటున్న కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌

కుప్పం, సెప్టెంబరు 18 (ఆంధ్రజ్యోతి): కుప్పం ఈ-సైకిల్‌ రాష్ట్ర ప్రభుత్వానికి, కలెక్టరేట్‌కు గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్‌ సాధించి పెట్టింది. ఈ రికార్డును శుక్రవారం కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌ అందుకున్నారు. నేపథ్యం ఏమిటంటే.. కుప్పం నియోజకవర్గంలో ఈ ఏడాది జనవరి 31వ తేదీన సీఎం చంద్రబాబు పర్యటించారు. అదే రోజున కడా ఆధ్వర్యంలో ఏకంగా 3,742 ఎలక్ట్రిక్‌ సైకిళ్లను సీఎం చంద్రబాబు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌లో చోటు సంపాదించుకుంది. ఈ నేపథ్యంలో కడా కార్యాలయంలో శుక్రవారం కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌కు ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఐఐటీ) కాన్పూర్‌ ప్రొఫెసర్‌ గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్స్‌ సర్టిఫికెట్‌ను అందజేశారు. ఈ కార్యక్రమంలో కడా పీడీ వికాస్‌ మర్మత్‌ పాల్గొన్నారు.

Updated Date - Sep 19 , 2026 | 01:39 AM