Share News

జిల్లా కోర్టు కాంప్లెక్సు నిర్మాణానికి ఒకటిన భూమిపూజ

ABN , Publish Date - Feb 24 , 2026 | 01:11 AM

తిరుపతిలో జిల్లా కోర్టు సముదాయం ఇరుగ్గా ఉండడం, నాయ్యాధికారుల రాకపోకలకు తరచూ ఆలస్యమవుతుం డడం,కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో కొత్త జిల్లా కోర్టు కాంప్లెక్సు నిర్మాణానికి స్థలం కేటాయించాలని జ్యుడిషియల్‌ విభాగం ప్రభుత్వానికి లేఖ రాసింది

జిల్లా కోర్టు కాంప్లెక్సు నిర్మాణానికి ఒకటిన భూమిపూజ

హాజరుకానున్న సుప్రీంకోర్టు సీజే

రూ.120కోట్ల నిధుల మంజూరు

తిరుపతి(కలెక్టరేట్‌), ఫిబ్రవరి 23 (ఆంధ్రజ్యోతి): తిరుపతిలో జిల్లా కోర్టు సముదాయం ఇరుగ్గా ఉండడం, నాయ్యాధికారుల రాకపోకలకు తరచూ ఆలస్యమవుతుం డడం,కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో కొత్త జిల్లా కోర్టు కాంప్లెక్సు నిర్మాణానికి స్థలం కేటాయించాలని జ్యుడిషియల్‌ విభాగం ప్రభుత్వానికి లేఖ రాసింది.స్పందించిన సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు కలెక్టర్‌ వెంకటేశ్వర్‌ ప్రత్యేక చొరవ తీసుకుని కలెక్టరేట్‌కు కూతవేటు దూరంలో దామినేడు వద్ద 14.40ఎకరాలు కేటాయించారు.జిల్లా కోర్టు కాంప్లెక్సు భవన నిర్మాణానికి రూ.120కోట్లు మంజూరైనట్లు తెలిసింది.ఈ స్థలానికి ఇప్పటికే రోడ్డు నిర్మాణ పనులను చేపట్టారు. మార్చి 1న ఇక్కడ నిర్మించనున్న జిల్లా కోర్టు కాంప్లెక్సుకు భూమిపూజ కార్యక్రమం జరగనుంది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సూర్యకాంత్‌ చేతుల మీదుగా జరిగే ఈ కార్యక్రమంలో మరో ఏడుగురు సుప్రీంకోర్టు జడ్జిలు, ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ధీరజ్‌సింగ్‌ ఠాకూర్‌ తదితర ప్రముఖులు హాజరు కానున్నారు.

Updated Date - Feb 24 , 2026 | 01:11 AM