మహా పర్వదినం...మార్మోగిన శివనామం
ABN , Publish Date - Jul 14 , 2026 | 02:01 AM
ముక్కంటి ఆలయాన్ని దర్శించుకునేందుకు సోమవారం భక్తులు పోటెత్తారు. రెండు రోజులు వరుస సెలవులతో భక్తుల రద్దీ నెలకొనగా చంద్రశేఖరుడైన పరమశివుడికి సోమవారం అత్యంతప్రీతికరం. అలాగే కృష్ణపక్షం చతుర్ధశి తిధి ఈశ్వరుని మాసశివరాత్రిగా భక్తులు ఆరాధిస్తారు.
శ్రీకాళహస్తి,జూలై13(ఆంధ్రజ్యోతి):ముక్కంటి ఆలయాన్ని దర్శించుకునేందుకు సోమవారం భక్తులు పోటెత్తారు. రెండు రోజులు వరుస సెలవులతో భక్తుల రద్దీ నెలకొనగా చంద్రశేఖరుడైన పరమశివుడికి సోమవారం అత్యంతప్రీతికరం. అలాగే కృష్ణపక్షం చతుర్ధశి తిధి ఈశ్వరుని మాసశివరాత్రిగా భక్తులు ఆరాధిస్తారు. ఇక శివుని జన్మనక్షత్రం ఆరుద్ర ఈ మూడు విశేషాలు ఒకే రోజున కలసిరావడం అరుదుగా దశాబ్దాలకు ఒకసారి సంభవిస్తుంది. ఈ క్రమంలో సోమవారం రోజున మాసశివరాత్రితో పాటు ఆరుద్ర నక్షత్రం కలిసిన మహావిశేష పర్వదినం కావడంతో భక్తులు పెద్దసంఖ్యలో ముక్కంటి ఆలయాన్ని దర్శించుకున్నారు ఉదయం నుంచి రాత్రివరకు సుమారు 40వేలమంది భక్తులు దర్శించుకున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. మహాశివరాత్రిని తలపించేలా ఆలయంలో భక్తుల శివనామ స్మరణ మార్మోగింది.ఆలయ చైర్మన్ కొట్టే సాయి, ఈవో బీకే వెంకటేశులు భక్తులకు అవసరమైన సౌకర్యాలను పర్యవేక్షించారు.