Share News

అట్టహాసంగా జడ్పీ పాలకవర్గ ప్రమాణస్వీకారం

ABN , Publish Date - Nov 21 , 2026 | 02:13 AM

జిల్లా పరిషత్‌ మొదటి చైర్మన్‌గా గాలివీడు జడ్పీటీసీ సభ్యుడు సుగవాసి ప్రసాద్‌బాబు, వైస్‌ చైర్‌పర్సన్‌గా పీటీఎం జడ్పీటీసీ సభ్యురాలు తలారి శరణ్య ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మదనపల్లె పట్టణం బెంగుళూరు రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన జడ్పీ కార్యాలయ సమావేశ మందిరంలో శుక్రవారం ఎన్నిక ప్రక్రియ నిర్వహించారు. మధ్యాహ్నం ఒంటి గంటకు నిర్వహించిన ప్రత్యేక సమావేశానికి ప్రిసైడింగ్‌ అధికారి, కలెక్టర్‌ నిశాంత్‌కుమార్‌ అధ్యక్షత వహించారు. తొలుత 25 మంది జడ్పీటీసీ సభ్యుల్లో సమావేశానికి హాజరైన 19 మందితో ప్రమాణస్వీకారం చేయించారు. వైసీపీ తరఫున గెలిచిన ఆరుగురు జడ్పీటీసీ సభ్యులు హాజరుకాలేదు.

అట్టహాసంగా జడ్పీ పాలకవర్గ ప్రమాణస్వీకారం
ఛైర్మన్‌గా ప్రమాణస్వీకారం చేస్తున్న సుగవాసి ప్రసాద్‌బాబు, వైస్‌ చైర్‌పర్సన్‌గా తలారి శరణ్య

జిల్లా తొలి చైర్మన్‌గా సుగవాసి ప్రసాద్‌బాబు

వైస్‌ చైర్‌పర్సన్‌గా తలారి శరణ్య

వైసీపీ జడ్పీటీసీలు గైర్హాజరు

కొత్త పాలకవర్గానికి అభినందనల వెల్లువ

అన్నమయ్య, నవంబర్‌ 20(ఆంధ్రజ్యోతి): జిల్లా పరిషత్‌ మొదటి చైర్మన్‌గా గాలివీడు జడ్పీటీసీ సభ్యుడు సుగవాసి ప్రసాద్‌బాబు, వైస్‌ చైర్‌పర్సన్‌గా పీటీఎం జడ్పీటీసీ సభ్యురాలు తలారి శరణ్య ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మదనపల్లె పట్టణం బెంగుళూరు రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన జడ్పీ కార్యాలయ సమావేశ మందిరంలో శుక్రవారం ఎన్నిక ప్రక్రియ నిర్వహించారు. మధ్యాహ్నం ఒంటి గంటకు నిర్వహించిన ప్రత్యేక సమావేశానికి ప్రిసైడింగ్‌ అధికారి, కలెక్టర్‌ నిశాంత్‌కుమార్‌ అధ్యక్షత వహించారు. తొలుత 25 మంది జడ్పీటీసీ సభ్యుల్లో సమావేశానికి హాజరైన 19 మందితో ప్రమాణస్వీకారం చేయించారు. వైసీపీ తరఫున గెలిచిన ఆరుగురు జడ్పీటీసీ సభ్యులు హాజరుకాలేదు.

జడ్పీ చైర్మన్‌గా సుగవాసి

పుంగనూరు, కురబలకోట జడ్పీటీసీ సభ్యులు నరసింహులు, సురేంద్రయాదవ్‌ సుగవాసి ప్రసాద్‌బాబు పేరును జడ్పీ చైర్మన్‌గా ప్రతిపాదించారు. హాజరైన సభ్యులందరూ బలపరిచారు. వైస్‌ చైర్‌పర్సన్‌గా పీటీఎం జడ్పీటీసీ సభ్యురాలు తలారి శరణ్యను కేవీపల్లె , కలకడ జడ్పీటీసీ సభ్యులు రెడ్డి మహేంద్ర, వెంకటరమణ ప్రతిపాదించారు. హాజరైన సభ్యులు బలపరిచారు. దీంతో వీరిద్దరూ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు కలెక్టర్‌ నిశాంత్‌కుమార్‌ ప్రకటించారు. ఇద్దరితో ప్రమాణస్వీకారం చేయించి, ధ్రువీకరణ పత్రాలను అందజేశారు. కార్యక్రమం ముగిసిన తర్వాత చైర్మన్‌, వైస్‌ చైర్‌పర్సన్‌లు ఎన్టీఆర్‌ సర్కిల్‌కు చేరుకుని ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి, నివాళులర్పించారు.

ప్రజాసేవకు అవకాశం దక్కింది

ఈ పదవి ద్వారా జిల్లా ప్రజలకు సేవ చేసే అవకాశం దక్కింది. జిల్లా అభివృద్ధికి అంకితభావంతో పనిచేస్తా. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం, సంక్షేమ పథకాల అమలుకు ప్రాధాన్యతనిస్తా. నాపై నమ్మకం ఉంచి ఈ పదవికి ఎంపిక చేసిన సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్‌కు కృతజ్ఙతలు.

- సుగవాసి ప్రసాదబాబు, జడ్పీ చైర్మన్‌

జిల్లా అభివృద్ధికి కృషి చేయాలి

నూతనంగా కొలువుదీరిన జిల్లా పరిషత్‌ పాలకవర్గానికి శుభాకాంక్షలు. ప్రజలు కల్పించిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ప్రజాసేవకు అంకితభావంతో పనిచేయాలి. జిల్లా అభివృద్ధికి సమష్టిగా కృషి చేయాలి. జిల్లా యంత్రాంగం నుంచి సహకారం అందిస్తా.

- నిశాంత్‌కుమార్‌, కలెక్టర్‌

జిల్లా పరిషత్‌ నూతన పాలకవర్గం ఇదే..

అన్నమయ్య, నవంబర్‌ 20(ఆంధ్రజ్యోతి): జిల్లా పరిషత్‌ నూతన పాలకవర్గం శుక్రవారం ప్రమాణస్వీకారం చేసింది. ఇందులో సుగవాసి ప్రసాద్‌బాబు చైర్మన్‌ (గాలివీడు), తలారి శరణ్య వైస్‌ చైర్‌పర్సన్‌ (పెద్దతిప్పసముద్రం), మండిపల్లి లక్ష్మీప్రసాద్‌రెడ్డి (చిన్నమండెం), కసిరెడ్డి హరిప్రియ (రామాపురం), యనమల మదన్‌మోహన్‌ (లక్కిరెడ్డిపల్లె), మల్లు కరుణ (సంబేపల్లె), గండికోట లక్ష్మీప్రసన్న (రాయచోటి), ఎజాజ్‌ అహమ్మద్‌ (గుర్రంకొండ,) జి.కవిత (చౌడేపల్లి), చేరెడ్డి సుబ్రమణ్యంనాయుడు (సోమల), తోమరం నరసింహులు (పుంగనూరు), పిల్లింగారి సురేంద్రయాదవ్‌ (కురబలకోట), పురం రెడె ్డమ్మ (పీలేరు), యర్రయ్యగారి వెంకట్రమణ (కలకడ), పి.రెడ్డిమహేంద్ర (కేవీపల్లె,) కె.లక్ష్మీదేవి (వాల్మీకిపురం), కె.షర్మిల (కలికిరి), ఎ.సుజాత (రామసముద్రం). వీరంతా టీడీపీ నుంచి గెలుపొందిన వారు. బీజేపీ నుంచి జె.మీనా (ములకలచెరువు), వైసీపీ నుంచి ఎర్రమద్దు లక్ష్మీ దేవమ్మ (బి.కొత్తకోట), ఓర్సు పుట్రాజు (సదుం), కిరణ్మయి (మదనపల్లె), బుక్కె సందప్ప (తంబళ్లపల్లె), బొంగ మనోహర్‌ (నిమ్మనపల్లె), ఆవుల మల్లికార్జునరెడ్డి (పెద్దమండ్యం).

Updated Date - Nov 21 , 2026 | 02:13 AM