Share News

వైభవంగా గోపూజ మహోత్సవం

ABN , Publish Date - Sep 04 , 2026 | 02:06 AM

: తిరుపతిలోని ఇస్కాన్‌ ఆలయంలో గురువారం శ్రీకృష్ణాష్టమి వేడుకల్లో భాగంగా పూజాది కార్యక్రమాలను శాస్ర్తోక్తంగా నిర్వహించారు. ఉదయం మంగళహారతితో ఆరంభించి గోపూజ మహోత్సవాన్ని వేడుకగా జరిపారు. ఆలయ గోశాలలో జరిగిన ఈ పూజను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. రాధాకృష్ణులు, అష్టసఖులకు ప్రత్యేక అలంకరణలు చేసి సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. అనంతరం కర్పూర హారతులు సమర్పించి భక్తాదులకు దర్శన భాగ్యం కల్పించారు. ఈ సందర్భంగా భక్తుల భజనలతో ఆలయంలో అధ్యాత్మికత వెల్లివెరిసింది. ఆలయం పక్కనే వున్న వినాయకనగర్‌ మైదానంలో సాయంత్రం జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.

వైభవంగా గోపూజ మహోత్సవం
విద్యుద్దీపాలంకరణతో మెరిసిపోతున్న ఇస్కాన్‌ ఆలయం

తిరుపతి(కల్చరల్‌), సెప్టెంబరు3(ఆంధ్రజ్యోతి) : తిరుపతిలోని ఇస్కాన్‌ ఆలయంలో గురువారం శ్రీకృష్ణాష్టమి వేడుకల్లో భాగంగా పూజాది కార్యక్రమాలను శాస్ర్తోక్తంగా నిర్వహించారు. ఉదయం మంగళహారతితో ఆరంభించి గోపూజ మహోత్సవాన్ని వేడుకగా జరిపారు. ఆలయ గోశాలలో జరిగిన ఈ పూజను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. రాధాకృష్ణులు, అష్టసఖులకు ప్రత్యేక అలంకరణలు చేసి సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. అనంతరం కర్పూర హారతులు సమర్పించి భక్తాదులకు దర్శన భాగ్యం కల్పించారు. ఈ సందర్భంగా భక్తుల భజనలతో ఆలయంలో అధ్యాత్మికత వెల్లివెరిసింది. ఆలయం పక్కనే వున్న వినాయకనగర్‌ మైదానంలో సాయంత్రం జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.

నేటి శ్రీకృష్ణాష్టమికి ప్రత్యేక ఏర్పాట్లు

శ్రీకృష్ణాష్టమిని పురస్కరించుకుని శుక్రవారం రాధాకృష్ణుల దర్శనార్థం భక్తులు అధిక సంఖ్యలో రానున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని ఆలయ నిర్వాహకులు అవసరమైన ఏర్పాట్లు చేశారు. ప్రత్యేక పూజల అనంతరం ఉదయం 8 గంటల నుంచి భక్తులకు రాధాకృష్ణుల దర్శనం కల్పిస్తున్నారు. ఉదయం 11 గంటలకు రాధాకృష్ణులకు మహాశంఖాభిషేక పూజలు నిర్వహించనున్నారు. సాధారణ భక్తులకు సర్వదర్శన క్యూలైన్‌, రాజగోపురం గుండా ప్రత్యేక క్యూలైన్‌, వీఐపీల కోసం ఆలయ నాలుగో ద్వారం గుండా క్యూలైన్‌ను ఏర్పాటు చేశారు. క్యూలైన్లలో వేచి ఉండే భక్తులకు మంచినీటి పంపిణీతో పాటు దర్శనానంతరం బయటకు వచ్చే సమయంలో నిరంతరాయంగా ప్రసాదాలను పంపిణీ చేయనున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని సామాన్య భక్తులకు ప్రాధాన్యమిస్తూ పాసులను రద్దు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. సాయంత్రం 4 గంటలకు వినాయనగర్‌ మైదానంలో ఉట్లోత్సవం జరగనుంది. శనివారం వ్యాస పూజ మహోత్సవంతో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ముగియనున్నాయి.

Updated Date - Sep 04 , 2026 | 02:06 AM