ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి
ABN , Publish Date - Sep 05 , 2026 | 01:29 AM
శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు శుక్రవారం జిల్లావ్యాప్తంగా ఘనంగా జరిగాయి.తిరుపతిలోని ఇస్కాన్ ఆలయంలో రాధాకృష్ణులకు, అష్టసఖులకు దర్శన హారతి, శంఖాభిషేక పూజలను శాస్ర్తోక్తంగా నిర్వహించారు.
తిరుపతి(కల్చరల్),సెప్టెంబరు4(ఆంధ్రజ్యోతి): శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు శుక్రవారం జిల్లావ్యాప్తంగా ఘనంగా జరిగాయి.తిరుపతిలోని ఇస్కాన్ ఆలయంలో రాధాకృష్ణులకు, అష్టసఖులకు దర్శన హారతి, శంఖాభిషేక పూజలను శాస్ర్తోక్తంగా నిర్వహించారు. రాధాగోవిందుల దర్శనం కోసం భక్తులు పోటెత్తారు. ఆలయ సమీపంలోని వినాయకనగర్ మైదానంలో సాయంత్రం ఉట్లోత్సవం ఉత్సాహంగా సాగింది. హరేరామ హరేకృష్ణ నామస్మరణల నడుమ యువత ఉట్టికోసం పోటీపడ్డారు. పదిసార్లు ప్రయత్నించి విఫలమైనా పదకొండో ప్రయత్నంలో ఉట్టిని సొంతం చేసుకుని సంబరం చేసుకున్నారు.