శ్రీవారి సేవకులకు గ్రేడింగ్!
ABN , Publish Date - Aug 20 , 2026 | 01:22 AM
తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. మామూలు రోజుల్లో సైతం వీరి సంఖ్య 80 వేలకు పైగా ఉంటోంది. ఈ నేపథ్యంలో భక్తులకు అందించే సేవలను మరింత మెరుగుపర్చడంతో పాటు వారికి ఎలాంటి అసౌకర్యం కలుగకుండా ఉండేందుకు టీటీడీ ప్రత్యేక చర్యలు చేపట్టింది. దీనిలో భాగంగా శ్రీవారి సేవకుల పనితీరును బేరీజు వేసేందుకు అధికారులు కొత్తగా గ్రేడింగ్ విధానాన్ని అమల్లోకి తీసుకువచ్చారు. సాధారణంగా రోజుకు సుమారు 3 వేల నుంచి 3,500 మంది శ్రీవారి సేవకులు వివిధ ప్రాంతాల్లో సేవలు అందిస్తున్నారు. వీరి పనితీరును పరిశీలించి ప్రత్యేకంగా గ్రేడింగ్ ఇవ్వనున్నారు. తమకు అప్పగించిన పనిని సక్రమంగా చేయడంతో పాటు అదనంగా పనిచేస్తుంటే అత్యుత్తమం అని, అప్పగించిన పనిని బాగా చేస్తే ఉత్తమం అని, సక్రమంగా చేయకపోతే నామమాత్రం అని గ్రేడింగ్ ఇస్తున్నారు. అత్యుత్తమ గ్రేడింగ్‌కు ఎంపికైన బృందాల సేవలను బ్రహ్మోత్సవాలు, ప్ర
అత్యుత్తమం, ఉత్తమం, నామమాత్రంగా విభజన
సూపర్‌వైజర్ల ద్వారా వారి పని తీరుపై పరిశీలన
బ్రహ్మోత్సవాలు, పర్వదినాల్లో సేవలపై అంచనా
తిరుపతి(టీటీడీ), ఆంధ్రజ్యోతి
తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. మామూలు రోజుల్లో సైతం వీరి సంఖ్య 80 వేలకు పైగా ఉంటోంది. ఈ నేపథ్యంలో భక్తులకు అందించే సేవలను మరింత మెరుగుపర్చడంతో పాటు వారికి ఎలాంటి అసౌకర్యం కలుగకుండా ఉండేందుకు టీటీడీ ప్రత్యేక చర్యలు చేపట్టింది. దీనిలో భాగంగా శ్రీవారి సేవకుల పనితీరును బేరీజు వేసేందుకు అధికారులు కొత్తగా గ్రేడింగ్ విధానాన్ని అమల్లోకి తీసుకువచ్చారు. సాధారణంగా రోజుకు సుమారు 3 వేల నుంచి 3,500 మంది శ్రీవారి సేవకులు వివిధ ప్రాంతాల్లో సేవలు అందిస్తున్నారు. వీరి పనితీరును పరిశీలించి ప్రత్యేకంగా గ్రేడింగ్ ఇవ్వనున్నారు. తమకు అప్పగించిన పనిని సక్రమంగా చేయడంతో పాటు అదనంగా పనిచేస్తుంటే అత్యుత్తమం అని, అప్పగించిన పనిని బాగా చేస్తే ఉత్తమం అని, సక్రమంగా చేయకపోతే నామమాత్రం అని గ్రేడింగ్ ఇస్తున్నారు. అత్యుత్తమ గ్రేడింగ్‌కు ఎంపికైన బృందాల సేవలను బ్రహ్మోత్సవాలు, ప్రత్యేక పర్వదినాల సమయంలో వినియోగించుకోనున్నారు.
నెలకు ఐదుగురు ప్రిన్సిపల్ సూపర్‌వైజర్లు
ప్రస్తుతం విధుల్లో ఉన్న/ పదవీ విరమణ చేసిన గెజిటెడ్ అధికారులు, ఆపై స్థాయి వారిని ప్రిన్సిపల్ సూపర్‌వైజర్లుగా టీటీడీ అధికారులు ఎంపిక చేశారు. వీరిలో వివిధ బ్యాంకులు, ప్రముఖ సంస్థల్లో ఉన్నత హోదాల్లో పనిచేసినవారు ఉంటారు. నెలకు ఐదుగురు ప్రిన్సిపల్ సూపర్‌వైజర్లు పనిచేస్తారు. వీరిలో ఒక్కొక్కరి కింద 10 నుంచి 15 మంది గ్రూప్ సూపర్‌వైజర్లు ఉంటారు. వారు తమకు అప్పగించిన పనిని సక్రమంగా నిర్వర్తిస్తున్నారా, లేదా అనే వివరాలను రోజూ యాప్‌లో పొందుపరుస్తారు. నెల ముగిసిన తర్వాత తమ స్థానంలో వచ్చే ప్రిన్సిపల్ సూపర్‌వైజర్లకు ఈ బాధ్యతలు అప్పగిస్తారు.
గ్రూప్ సూపర్‌వైజర్లతో పర్యవేక్షణ
గ్రాడ్యుయేషన్ అర్హత ఉన్నవారిని గ్రూప్ సూపర్‌వైజర్లుగా ఎంపిక చేస్తున్నారు. వీరు 15రోజుల పాటు విధుల్లో ఉంటారు. ఒక్కో గ్రూప్ సూపర్‌వైజర్ కింద 10 నుంచి 15 శ్రీవారి సేవకుల బృందాలు ఉంటాయి. ప్రతి గ్రూపులో 10 నుంచి 15 మంది సభ్యులు ఉంటారు. తమకు కేటాయించిన గ్రూపుల్లోని సభ్యుల హాజరు, పనితీరును వీరు నిత్యం పర్యవేక్షిస్తారు. శ్రీవారి సేవకులు భక్తులను పలకరించే, సేవ చేసే విధానాన్ని పరిశీలించి గ్రేడింగ్ ఇస్తారు. ఈ వివరాలను ప్రతిరోజూ యాప్‌లో నమోదు చేసి ప్రిన్సిపల్ సూపర్‌వైజర్లకు అందిస్తారు.