Share News

‘టిడ్కో’ గృహాల కోసం కట్టిన డిపాజిట్‌ వెనక్కిచ్చేస్తున్న ప్రభుత్వం

ABN , Publish Date - May 21 , 2026 | 02:05 AM

పేద, మధ్యతరగతి కుటుంబాలకు సొంతింటి కలను నెరవేర్చడానికి చేపట్టిన ఏపీ టిడ్కో గృహ పథకంలో ఇల్లు పొందలేక పోయిన లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వం ఊరటనిచ్చే నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. గృహాలకోసం చెల్లించిన డిపాజిట్‌ మొత్తాలను తిరిగి చెల్లించే ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. దాంతో తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయానికి లబ్ధిదారులు క్యూ కడుతున్నారు.

‘టిడ్కో’   గృహాల కోసం కట్టిన డిపాజిట్‌ వెనక్కిచ్చేస్తున్న ప్రభుత్వం
తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో కిక్కిరిసిన లబ్ధిదారులు

పేద, మధ్యతరగతి కుటుంబాలకు సొంతింటి కలను నెరవేర్చడానికి చేపట్టిన ఏపీ టిడ్కో గృహ పథకంలో ఇల్లు పొందలేక పోయిన లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వం ఊరటనిచ్చే నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. గృహాలకోసం చెల్లించిన డిపాజిట్‌ మొత్తాలను తిరిగి చెల్లించే ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. దాంతో తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయానికి లబ్ధిదారులు క్యూ కడుతున్నారు.

- తిరుపతి సిటీ, ఆంధ్రజ్యోతి

టిడ్కో ఇళ్ల కోసం 2018-19 సంవత్సరాల మధ్య తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలో 2,472 మంది వివిధ మొత్తాల్లో సుమారు రూ.5కోట్ల డిపాజిట్లు కట్టి దరఖాస్తు చేసుకున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక టిడ్కో పథకాన్ని రద్దు చేసింది. దీంతో లబ్ధిదారులు అయోమయంలో పడి, కట్టిన డిపాజిట్ల కోసం కార్యాలయాల చుట్టూ తిరిగారు. జగన్‌ రెడ్డి ప్రభుత్వంలోని స్పందనలో అనేక ఫిర్యాదులు వచ్చినప్పటికీ ఫలితం కనిపించలేదు. తిరిగి చంద్రబాబు సీఎం అయ్యాక తమ సొమ్ముకోసం ఎదురుచూస్తున్న వేలాది మంది లబ్ధిదారులకు ఉపశమనం లభించింది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో లబ్ధిదారుల ఖాతాల్లో నేరుగా డబ్బులు జమ చేయడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అర్హుల వివరాల పరిశీలన చేశాక దశలవారీగా రీఫండ్‌లు అందించనున్నారు.

ప్రత్యేక కౌంటర్‌ ఏర్పాటు చేయాల్సిందే..

టిడ్కో లబ్ధిదారుల డిపాజిట్‌ రీఫండ్‌ కోసం తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో సోమవారం నుంచి దరఖాస్తుల పరిశీలన మొదలుపెట్టారు. 2,472 మంది ఉండడంతో లబ్ధిదారులు కార్పొరేషన్‌ కార్యాలయానికి క్యూ కడుతున్నారు. అసలే ఇరుకైన కార్యాలయంలో జనన, మరణ ధ్రువీకరణ పత్రాల కోసం వచ్చే జనంతోపాటు ట్రెజరీ డెస్క్‌ కూడా ఒకేచోట ఉండడంతో టిడ్కో లబ్ధిదారులు గందరగోళానికి గురవుతున్నారు. అలిపిరి పోలీ్‌సస్టేషన్‌ సమీపంలోని కార్పొరేషన్‌ హౌసింగ్‌ కార్యాలయం వద్ద ప్రత్యేక కౌంటర్‌ను ఏర్పాటుచేస్తే తప్ప రోజుకు కనీసం వంద దరఖాస్తులు పరిశీలించినా.. నెలరోజులు గడువు కావాల్సి వస్తుంది. అధికారులు తగిన చర్యలు తీసుకుని గందరగోళానికి తెరదించాల్సిన అవసరం ఉంది.

లబ్ధిదారులు ఇవి తీసుకురావాలి

ఆధార్‌ కార్డు, కార్పొరేషన్‌ డీడీ రసీదు, బ్యాంకు అకౌంట్‌ పాస్‌బుక్‌ జిరాక్స్‌ తీసుకుని కార్పొరేషన్‌ కార్యాలయంలో డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌ చేసుకోవాలి. తెచ్చిన డేటా సరిపోతే బ్యాంక్‌ అకౌంట్‌ యాడ్‌ చేసుకుని నగదు బదిలీ చేస్తారు.

ఫ సంక్షిప్తంగా..

లబ్ధిదారుల చెల్లించిన చదరపు

సంఖ్య మొత్తం అడుగులు

359 రూ.500 300

827 రూ.12,500 365

1286 రూ.25వేలు 430

Updated Date - May 21 , 2026 | 02:05 AM