మంచి కథా చిత్రం రాకాస
ABN , Publish Date - Mar 26 , 2026 | 01:58 AM
మంచి కథతో రూపొందించిన రాకాస చిత్రాన్ని ఆదరించాలని నిర్మాత నిహారిక కొణిదల కోరారు. మిట్స్ ఇంజనీరింగ్ కళాశాలలో బుధవారం రాకాస చిత్ర డైరెక్టర్ మానస శర్మ, హీరోహీరోయిన్లు సంగీత్ శోభన్, నయాన్‌సారిక, కమెడియన్ గెటప్ శ్రీను సందడి చేశారు.
కురబలకోట, మార్చి 25(ఆంధ్రజ్యోతి): మంచి కథతో రూపొందించిన రాకాస చిత్రాన్ని ఆదరించాలని నిర్మాత నిహారిక కొణిదల కోరారు. మండలంలోని మిట్స్ ఇంజనీరింగ్ కళాశాలలో బుధవారం రాకాస చిత్ర డైరెక్టర్ మానస శర్మ, హీరోహీరోయిన్లు సంగీత్ శోభన్, నయాన్‌సారిక, కమెడియన్ గెటప్ శ్రీను సందడి చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో నిహారిక మాట్లాడుతూ కుటుంబ సమేతంగా చూడదగ్గ కథాంశం, కామెడీ, హర్రర్ మేళవింపుతో ఈ చిత్రం ఉంటుందన్నారు. టీజర్ ఇప్పటికే మంచి ఆదరణ పొంది, అంచనాలను పెంచిందన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు అడిగిన పలు ప్రశ్నలకు ఆమె సమాధానమిచ్చారు. ఏప్రిల్ 3న విడుదలయ్యే ఈ సినిమాను ప్రతి ఒక్కరూ థియేటర్లలో చూడాలని కోరారు. అనంతరం సినిమా యూనిట్‌ను కళాశాల యాజమాన్యం సన్మానించింది. కాగా హీరోహీరోయిన్లతో సెల్ఫీలు తీసుకోవడానికి విద్యార్థులు ఎగబడ్డారు. ఈ కార్యక్రమంలో ఛాన్సులర్ ఎన్.విజయభాస్కర్ చౌదరి, ప్రో ఛాన్సులర్ ద్వారకనాథ్, వీసీ యువరాజ్ పాల్గొన్నారు.