Share News

వైద్యం కోసం వెళుతూ...

ABN , Publish Date - Jun 15 , 2026 | 12:28 AM

నాటువైద్యం కోసం మదనపల్లె నుంచి ద్విచక్ర వాహనంలో వెళుతున్న దంపతులను మినీ లారీ ఢీకొనడంతో మృతి చెందారు. ఈ సంఘటన ఆదివారం పుంగనూరు మండలం ఈడిగపల్లెలో చోటుచేసుకుంది.

వైద్యం కోసం వెళుతూ...
మృతి చెందిన అమీర్‌, సల్మా దంపతులు (ఫైల్‌ ఫొటో)

- ఈడిగపల్లె వద్ద రోడ్డు ప్రమాదంలో దంపతుల మృతి

- కుమారుడికి తీవ్ర గాయాలు

పుంగనూరు రూరల్‌, జూన్‌14(ఆంధ్రజ్యోతి) : నాటువైద్యం కోసం మదనపల్లె నుంచి ద్విచక్ర వాహనంలో వెళుతున్న దంపతులను మినీ లారీ ఢీకొనడంతో మృతి చెందారు. ఈ సంఘటన ఆదివారం పుంగనూరు మండలం ఈడిగపల్లెలో చోటుచేసుకుంది. పుంగనూరు సీఐ సుబ్బరాయుడు కథనం మేరకు.. మదనపల్లె రామారావు కాలనీకి చెందిన షేక్‌ అమీర్‌(45) హోటల్లో వంట మాస్టర్‌గా పనిచేస్తున్నాడు. కుమారుడు ముస్తాఖిర్‌ (19) అనారోగ్య సమస్యతో బాధపడుతున్నాడు. పుంగనూరు మండలం ఈడిగపల్లెలో నాటు వైద్యం చేయించాలని భార్య సల్మా(40), కుమారుడితో కలిసి ఆదివారం ఉదయం ద్విచక్ర వాహనంలో బయల్దేరారు. ఈడిగపల్లె చెక్‌పోస్టు వద్ద వెళుతుండగా మదనపల్లె వైపు నుంచి ఇంటి సామాన్లతో వస్తున్న మినీలారీ అతివేగంగా వచ్చి ఢీకొంది. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనం దూరంగా పడిపోగా దంపతులు అమీర్‌, సల్మా అక్కడికక్కడే మృతి చెందారు. ముస్తాఖిర్‌(19) తీవ్రంగా గాయపడ్డాడు. విషయం తెలుసుకున్న సీఐ సుబ్బరాయుడు సంఘటనా స్థలానికి చేరుకుని రోడ్డు ప్రమాదానికి గల కారణాలు తెలుసుకుని మృతదేహాలను పోస్టుమార్టం కోసం స్థానిక ప్రభుత్వాస్పతికి తరలించారు. ముస్తాఖిర్‌ను మదనపల్లె ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. బిడ్డ ఆరోగ్యం బాగు చేయాలని వచ్చిన దంపతులు మృతి చెందడంతో కుటుంబీకులు ఆస్పత్రి వద్ద కన్నీటీ పర్యంతమయ్యారు.

Updated Date - Jun 15 , 2026 | 12:28 AM