ఆర్టీసీ బస్సు ఢీకొని మేకల కాపరి మృతి
ABN , Publish Date - Nov 03 , 2026 | 01:30 AM
మండలంలోని కడప - బెంగళూరు జాతీయ రహదారిపై కేశాపురం వద్ద సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మేకల కాపరి మృతి చెందారు. మూడు గొర్రెలు మృత్యువాత పడ్డాయి. గ్రామస్తుల వివరాల మేరకు..
- మూడు గొర్రెలు కూడా..
చిన్నమండెం, నవంబరు 2 (ఆంధ్రజ్యోతి): మండలంలోని కడప - బెంగళూరు జాతీయ రహదారిపై కేశాపురం వద్ద సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మేకల కాపరి మృతి చెందారు. మూడు గొర్రెలు మృత్యువాత పడ్డాయి. గ్రామస్తుల వివరాల మేరకు.. కేశాపురం గ్రామం దిగువగొల్లపల్లి దేవళంపేటకు చెందిన కంచి లక్ష్మీపతి (35) గొర్రెలు మేపుకుని ఇంటికి తిరిగి వస్తుండగా కేశాపురం మర్రిచెట్టు వద్ద మదనపల్లె నుంచి కడప వైపు వెళ్తున్న ఏపీ04 జడ్ 0305 నెంబర్ ఆర్టీసీ బస్సు అదుపుతప్పి ఢీకొంది. ఈ ఘటనలో లక్ష్మీపతితో పాటు మూడు గొర్రెలు మృతి చెందాయి. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. లక్ష్మీపతికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. కుటుంబ పెద్ద మృతితో వారు బోరున విలపించారు.