Share News

వైభవోపేతం..రథోత్సవం

ABN , Publish Date - Mar 31 , 2026 | 01:32 AM

వాల్మీకిపురం పట్టాభిరాముడి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం రథోత్సవం అంగరంగ వైభవంగా సాగింది

వైభవోపేతం..రథోత్సవం
అశేష భక్తజనం నడుమ కదులుతున్న రథం (ఇన్‌సెట్‌లో) బ్రహ్మరథంలో కొలువుదీరిన సీతారామలక్ష్మణులు

వాల్మీకిపురం, మార్చి 30(ఆంధ్రజ్యోతి): వాల్మీకిపురం పట్టాభిరాముడి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం రథోత్సవం అంగరంగ వైభవంగా సాగింది. ఉదయం ఆలయంలో నిత్య కైంకర్యాల అనంతరం సీతారామలక్ష్మణుల ఉత్సవమూర్తులను అలంకరించి, తిరుచ్చిలో ప్రదర్శనగా తీసుకెళ్లి రథారోహణం గావించారు. 9 గంటలకు రథోత్సవం ప్రారంభమైంది. శ్రీరామ వ్రతమాల భక్తులు అశేష సంఖ్యలో కదలి రాగా రథోత్సవం రమణీయంగా సాగింది. ఒక వైపు భానుడు ప్రతాపం చూపుతున్నా లెక్కచేయకుండా భక్తులు రామనామస్మరణ చేస్తూ రథం వెంట సాగారు. మధ్యాహ్నం 12 గంటలకు రథోత్సవం ముగిసింది. అనంతరం పురవీధుల్లో మోతగాళ్ల ధూళి ఉత్సవం నిర్వహించారు. దేవతామూర్తులకు స్నపన తిరుమంజనం, ఏకాంతసేవ, పూజలు నిర్వహించారు.

గరుడిడిపై పట్టాభిరాముడి విహారంపట్టాభిరాముడి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం రాత్రి సీతారాముల కల్యాణం అనంతరం గరుడ సేవ నిర్వహించారు. సీతాలక్ష్మణ సమేత పట్టాభిరాముడిని విశేషాలంకరణ లతో గరుడ వాహనంపై అధిష్ఠింపజేసి పుర వీధుల్లో ఊరేగించారు. సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.

బ్రహ్మోత్సవాల్లో నేడు..

పట్టాభిరాముడి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం ఉదయం తిరుచ్చి ఉత్సవం, సాయంత్రం ఊంజల్‌సేవ, రాత్రికి అశ్వవాహనం (పార్వేట ఉత్సవం) ఉంటాయి.

Updated Date - Mar 31 , 2026 | 01:32 AM