Share News

ఘనంగా గంగజాతర

ABN , Publish Date - Mar 12 , 2026 | 02:36 AM

పుంగనూరులో సుగుటూరు గంగమ్మ జాతర బుధవారం ఘనంగా జరిగింది. వేలాదిమంది భక్తులు అమ్మవారికి గెరిగలు మోసి మొక్కులు చెల్లించుకున్నారు. మంగళవారం రాత్రి పట్టణంలో ఊరేగింపు పూర్తి చేసుకున్న అమ్మవారిని జమీందారుల ప్యాలె్‌సలోని సుగుటూరు గంగమ్మ ఆలయంలో భక్తుల దర్శనం కోసం కొలువుదీర్చారు.

ఘనంగా గంగజాతర
ప్రత్యేక అలంకరణలో సుగుటూరు గంగమ్మ, గెరిగలతో మొక్కులు తీర్చుకుంటున్న భక్తులు

గెరిగలతో మొక్కులు తీర్చుకున్న భక్తులు

కిటకిటలాడిన అమ్మవారి ఆలయాలు

పుంగనూరు రూరల్‌, మార్చి 11(ఆంధ్రజ్యోతి): పుంగనూరులో సుగుటూరు గంగమ్మ జాతర బుధవారం ఘనంగా జరిగింది. వేలాదిమంది భక్తులు అమ్మవారికి గెరిగలు మోసి మొక్కులు చెల్లించుకున్నారు. మంగళవారం రాత్రి పట్టణంలో ఊరేగింపు పూర్తి చేసుకున్న అమ్మవారిని జమీందారుల ప్యాలె్‌సలోని సుగుటూరు గంగమ్మ ఆలయంలో భక్తుల దర్శనం కోసం కొలువుదీర్చారు. తోటి కులస్తులు గంగమ్మకు జంతుబలులు సమర్పించాక పూజలు ప్రారంభమయ్యాయి. గంగమ్మ ఆలయంలోకి చేరుకోగానే బజారువీధిలో నడివీధి గంగమ్మను ఏర్పాటు చేసి పూజలు చేశారు. పుంగనూరు అష్టగంగమ్మలు.. విరూపాక్షి మారెమ్మ, తూర్పుపాలెంలో స్థలగంగమ్మ, పలమనేరురోడ్డులోని మల్లారమ్మ, తూర్పు మొగసాలలోని నల్లగంగమ్మ, కట్టకిందపాళ్యంలోని పడమటి గంగమ్మ, పుంగమ్మ కట్టపై నీళ్లరాళ్ల గంగమ్మ, కోనేరు వద్దగల బోయకొండ గంగమ్మ, నడివీధి గంగమ్మ ఆలయాలు కిక్కిరిశాయి. భక్తులు టెంకాయలు, జంతుబలులు, పూలు, నిమ్మకాయలు, గెరిగలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు.విరూపాక్షమ్మ, మారెమ్మ విగ్రహాలను చాందినీబండ్లపై ఊరేగించారు. పట్టణంలో ట్రాఫిక్‌ అంతరాయం లేకుండా బైపా్‌సరోడ్డులో వాహనాలను పోలీసులు మళ్లించారు. బుధవారం అర్ధరాత్రి నుంచి సుగుటూరు గంగమ్మ ఊరేగింపు, జలధి కార్యక్రమాలకు నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు.

Updated Date - Mar 12 , 2026 | 02:36 AM