Share News

జన గణనకు సిద్ధం కండి

ABN , Publish Date - Jan 14 , 2026 | 01:40 AM

త్వరలో జరగనున్న జగన గణనకు అధికారులు సిద్ధంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వ ఇన్‌చార్జి ప్రధాన కార్యదర్శి రావత్‌ అధికారులను ఆదేశించారు. మంగళవారం అమరావతి నుంచి ఆయన మున్సిపల్‌ కమిషనర్లు, ఇతర శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు

జన గణనకు సిద్ధం కండి

తిరుపతి సిటీ, జనవరి 13(ఆంధ్రజ్యోతి): త్వరలో జరగనున్న జగన గణనకు అధికారులు సిద్ధంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వ ఇన్‌చార్జి ప్రధాన కార్యదర్శి రావత్‌ అధికారులను ఆదేశించారు. మంగళవారం అమరావతి నుంచి ఆయన మున్సిపల్‌ కమిషనర్లు, ఇతర శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. ఇప్పటి వరకు తిరుపతి పరిధిలో ఉన్న జనాభా, ఎన్ని ఇళ్ళు ఉన్నాయి? అనే విషయాలను అడిగి తెలుసుకున్నారు. తిరుపతి పరిధి విస్తరించడం, విద్య, వైద్య కేంద్రాలు ఎక్కువగా ఉండటంతో బయట నుంచి వచ్చి స్థిర పడే వారి సంఖ్య అధికంగా ఉందని అదనపు కమిషనరు శారదాదేవి తెలిపారు. ఈ వీడియో కాన్ఫరెన్సులో తిరుపతి నుంచి డిప్యూటీ కమిషనరు అమరయ్య, డీసీపీ మహబూబ్‌ ఖాన్‌, ఏసీపీలు మూర్తి, పార్వతీప్రియ పాల్గొన్నారు.

Updated Date - Jan 14 , 2026 | 01:40 AM