స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధంకండి
ABN , Publish Date - Jun 04 , 2026 | 01:16 AM
దొంగ ఓట్లను తొలగించే ఎస్‌ఐఆర్ కార్యక్రమంలో చురుగ్గా పాల్గొనాలని బీఎల్‌ఏలకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ పిలుపునిచ్చారు.తిరుపతి రాఘవేంద్రనగర్‌లోని జిల్లా బీజేపీ కార్యాలయానికి బుధవారం వచ్చిన ఆయనకు జిల్లా అధ్యక్షుడు సామంచి శ్రీనివాస్, వరప్రసాద్, చంద్రారెడ్డి తదితర నాయకులు స్వాగతం పలికారు.
బీజేపీ శ్రేణులకు అధ్యక్షుడు మాధవ్ దిశానిర్దేశం
తిరుపతి(నేరవిభాగం), జూన్ 3(ఆంధ్రజ్యోతి): దొంగ ఓట్లను తొలగించే ఎస్‌ఐఆర్ కార్యక్రమంలో చురుగ్గా పాల్గొనాలని బీఎల్‌ఏలకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ పిలుపునిచ్చారు.తిరుపతి రాఘవేంద్రనగర్‌లోని జిల్లా బీజేపీ కార్యాలయానికి బుధవారం వచ్చిన ఆయనకు జిల్లా అధ్యక్షుడు సామంచి శ్రీనివాస్, వరప్రసాద్, చంద్రారెడ్డి తదితర నాయకులు స్వాగతం పలికారు. అనంతరం మాధవ్ పార్టీ నాయకులతో కాసేపు మాట్లాడారు.గత ఎన్నికల సమయంలో వైసీపీ నాయకులు తిరుపతిలో 35వేల దొంగ ఓట్లను చేర్చారని, ఈ దఫా మళ్లీ దొంగ ఓట్లను చేర్పించేందుకు ప్రయత్నిస్తారని, కాబట్టి బీఎల్‌ఏలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.త్వరలో జరగనున్న స్థానిక సంస్థల, తిరుపతి నగరపాలక సంస్థ ఎన్నికలకు పార్టీ శ్రేణులు ఇప్పటి నుంచే సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. వార్డుల్లో విస్తృతంగా పర్యటిస్తూ కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను, ప్రధాని నరేంద్ర మోదీ 12 ఏళ్ల పాలనలో విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు.పార్టీ బలోపేతంతో పాటు ప్రజలతో మరింత మమేకం కావడంపై దృష్టి సారించాలని సూచించారు. ఎన్నికల నాటికి ప్రతి బూత్ లెవెల్లో పార్టీని బలోపేతం చేసి విజయానికి కృషి చేయాలని దిశానిర్దేశం చేశారు.అనంతరం ఆయన పార్టీ నాయకులతో కలిసి రుయా సర్కిల్ సమీపంలోని ఈట్ స్ర్టీట్‌ను సందర్శించారు.టీ తాగి అక్కడ కాసేపు గడిపారు.