గ్యాస్ కష్టాలు
ABN , Publish Date - Mar 26 , 2026 | 01:55 AM
పెద్దతిప్పసముద్రం మండలంలో గ్యాస్ కొరత అధికంగా ఉంది. అవసరాలకు సరిపడా సరఫరా చేయకపోవడంతో గ్యాస్ వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
పెద్దతిప్పసముద్రం మండలంలో గ్యాస్ కొరత అధికంగా ఉంది. అవసరాలకు సరిపడా సరఫరా చేయకపోవడంతో గ్యాస్ వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బుధవారం స్థానిక సాయికృష్ణ ఇండేన్ గ్యాస్ గోడౌన్ వద్ద వినియోగదారులు ఖాళీ సిలిండర్లతో క్యూ కట్టారు. మండలంతో పాటు బి.కొత్తకోటకు చెందిన అధిక శాతం మంది వినియోగదారులు ఈ ఏజెన్సీలోనే ఉండటంతో ఉదయం 5గంటలకే క్యూలో నిల్చున్నారు. 9 గంటలకు లారీలో స్టాకు రావడంతో క్యూలో ఉన్న వారికి అందించారు. మిగిలిన వారికి మళ్లీ స్టాకు రాగానే అందజేస్తామని చెప్పి పంపారు.
- పెద్దతిప్పసముద్రం, (ఆంధ్రజ్యోతి)